ప్రధాని మోదీకి ఆలస్యంగా ఆహ్వానం.. హాజరుపై సందిగ్ధత
గాజాలో శాంతి, స్థిరత్వం లక్ష్యంగా ఈజిప్ట్‌లోని షర్మల్ షేక్‌లో చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రధాని మోదీ తరఫున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవుతున్నారు. అమెరికా రూపొందించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాను పలు దేశాలు సమర్థించాయి. ఒప్పందం ఫలితాలపై ప్రపంచ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తోంది.
ఈజిప్ట్‌లోని షర్మల్ షేక్ సిటీలో చారిత్రాత్మక గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. గాజాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. ఈ సదస్సుకి ప్రధాని మోదీ తరఫున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవుతున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు ఇందులో పాల్గొంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

