వానపాము అనుకున్నారా ?? కాదు..ఇది నిజం పామే
శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపామును గుర్తించారు. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది. చూడటానికి వానపామును పోలినట్టుగానే ఉన్నా.. పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా సుమారు 12 అంగుళాలు పొడవు ఉంది.
ఇది నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ వింతగా కనిపించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకం ఏంటంటే దాని తల చివర సుత్తిలాంటి ఆకారం ఉండటం. ఇది చూపరులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేలపై మెరుస్తూ కనిపించిన ఈ వింత పామును చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారి.. వైల్డ్ లైఫ్ సొసైటీ దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన వారు ఇది వానపాము జాతికి చెందిన హేమర్ హెడ్ వార్మ్ అని చెబుతున్నారు. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే హేమర్ హెడ్ వార్మ్ విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని చెబుతున్నారు. వీటిని ఇళ్లల్లోకి చొరబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది వానపాములను తిని పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిపారు. కాగా, అరుదైన హేమర్ హెడ్ వార్మ్ జాతి అంతరించిపోకుండా అధికారులు సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూపాయితో కూడా బంగారం కొనొచ్చు.. ఎలాగంటే..
దీపావళికి 9 రోజులు సెలవులు.. ఇక పండగే పండగ
చైనాకు ట్రంప్ బిగ్ షాక్.. అదనంగా 100 శాతం సుంకాలు
3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి వీడియో
బ్యాంకునుంచి నగదు డ్రా చేస్తున్నారా..జాగ్రత్త వీడియో
ఉగ్ర ముఠా టార్గెట్ అవేనా? వీడియో
ఈ పెట్టె వెనుక పెద్ద చరిత్రే ఉంది.. దొంగలూ ఎత్తుకెళ్లలేరు వీడియో
విషాదం..కొన్ని గంటల్లో తాళి కట్టాల్సిన వరుడు.. అంతలోనే వీడియో
కార్మికుడి అకౌంట్లో రూ. 77 లక్షలు.. ఏం జరిగిందంటే వీడియో
ముంబైని హడలెత్తిస్తున్న చిరుతలు .. వీడియో వైరల్

