AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపాయితో కూడా బంగారం కొనొచ్చు.. ఎలాగంటే..

రూపాయితో కూడా బంగారం కొనొచ్చు.. ఎలాగంటే..

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 6:00 PM

Share

బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. సాధారణంగా మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటేనే బంగారం అడ్డూ అదుపులేకుండా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి చేయమని సూచిస్తున్నారు పలువురు నిపుణులు.

డిజిటల్‌ గోల్డ్‌ వివిధ కారణాల వల్ల ఆకర్షణీయంగా మారుతున్నాయి. తక్కువ డబ్బుతో సులభంగా డిజిట్ గోల్డ్‌లో పెట్టుబడి చేయవచ్చు. డిజిటల్ బంగారం అనేది వర్చువల్ బంగారం. కొనుగోలుదారులు నేరుగా ఆన్ లైన్‌లో ఆ రోజు ధరను బట్టి తమ పెట్టుబడికి తగినంత బంగారం కొనుక్కోవచ్చు. ఆ కొన్న బంగారాన్ని కొనుగోలుదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట లేదా తక్కువ పరిమితి లేదు. కొనుగోలుదారులు 100 రూపాయలతో కూడా మిల్లీ గ్రాముల మోతాదులో బంగారం కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు విషయంలో స్వచ్ఛత, మేకింగ్ ఛార్జీలు వంటివి ఉంటాయి. అయితే డిజిటల్ గోల్డ్‌ విషయంలో అలాంటివేమి ఉండవు. సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. Paytm, Google Pay వంటి ఎలక్ట్రానిక్ వాలెట్లు కూడా ఇప్పుడు డిజిటల్ బంగారు పెట్టుబడికి ఒక వేదికను అందిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లో పలు సంస్థల నుంచి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం 1 రూపాయితో డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొన్న తర్వాత కావాలంటే ఫిజికల్ గోల్డ్‌ను మీ ఇంటి వద్దే పొందవచ్చు. ఆన్‌లైన్ రుణాలకు డిజిటల్ గోల్డ్‌ను పూచీకత్తుగా ఉపయోగించవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళికి 9 రోజులు సెలవులు.. ఇక పండగే పండగ

చైనాకు ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. అదనంగా 100 శాతం సుంకాలు

3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్‌

మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ

కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్‌ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు