రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
బిహార్‌లో పబ్జీ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్జీ ఆడుతున్నారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంలో రైలు వస్తున్న సంగతిని వారు గుర్తించలేదు. దాంతో వేగంగా వచ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ రైలు సెక్షన్‌లోని మాన్సా తోలాలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. మృతులను గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు వారి పిల్లల మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామాలకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??
Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
Game Changer: గేమ్ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్ సర్ప్రైజ్ గిఫ్ట్