Andhra Pradesh: కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం
వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ప్రేమ పెళ్లి వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అక్కంపేటలో ఇటీవల ప్రేమజంటపెళ్లి చేసుకుంది. వీరికి మైసన్నగూడెం గ్రామానికి చెందిన యువకుడి మేనమామ రాజు ఆశ్రయం కల్పించాడు. అయితే యువతి ఆచూకీ తెలపాలని రాజు ఇంటికి దగ్గర యువతి బంధువులు...
ప్రేమ వ్యవహారలు కొన్ని సందర్భాల్లో తీవ్ర గొడవలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా యువతీ, యువకుల కుటుంబ సభ్యుల్లో ఈ సంఘటనలు చిచ్చు పెట్టే సందర్భాలు ఎన్నో జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. యువతీయువకుల ప్రేమ వ్యవహారం కాస్త ఇరు కుటుంబాల మధ్య గొడవకు దార తీసింది. కర్రలతో దాడి చేసుకునే పరిస్థితికి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ప్రేమ పెళ్లి వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అక్కంపేటలో ఇటీవల ప్రేమజంటపెళ్లి చేసుకుంది. వీరికి మైసన్నగూడెం గ్రామానికి చెందిన యువకుడి మేనమామ రాజు ఆశ్రయం కల్పించాడు. అయితే యువతి ఆచూకీ తెలపాలని రాజు ఇంటికి దగ్గర యువతి బంధువులు గొడవ చేశారు. దీంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పెళ్లి చేసుకున్న ప్రేమజంట సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంటా మంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం కలకలం రేపింది. తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని ఆ యువతి, యువకుడు చెబుతున్నారు. ప్రస్తుతం వీరి సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..