TOP9 ET: హమ్మయ్య.. రవితేజ సేఫ్.! | శృంగార సీన్లు లీక్.! షాక్‌లో హీరోయిన్.
ఓ రెండు మూడు రోజుల నుంచి ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి.. మెగా స్టార్ చిరు సినిమాను రిజెక్ట్ చేసిందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా.. కృతి షెట్టి తీరును తప్పుబట్టేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై రియాక్టైంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని,
01.Raviteja: హమ్మయ్య! రవన్న సేఫ్..!
మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు బాగున్నారు. తాను బానే ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. సర్జరీ స్మూత్‌గా జరిగిందని.. డిశ్చార్జ్ కూడా అయ్యానని తన ఎక్స్ పోస్ట్ లో రాసుకొచ్చారు. గ్రేట్ ఫుల్ ఫర్ ఆల్ యువర్ వార్మ్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. ఇక రవితేజ ఆర్టీ 75 సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. కుడిచేతికి గాయమవడంతో.. ఆసుపత్రిలో చేరారు. చిన్న సర్జరీ తర్వాత సేఫ్‌గా బయటికి వచ్చా అంటూ ఈ అప్డేట్ ఇచ్చారు. ఎగ్జైటెడ్ టూ బీ… బ్యాక్ టూ షూట్ అంటూ అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేశారు.
02.chiru: అశ్వినీ దత్‌కు.. మెగాస్టార్ అపూర్వ కానుక.!
మెగాస్టార్ చిరు అశ్వినీ దత్‌కు అపూర్వ కానుక ఇచ్చారు. వెల్ క్రాఫ్‌టెడ్ శంకును బహూకరించారు. తన ఇంద్ర సినిమా రిలీజై 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఈ మూవీ మేకర్స్ అందరినీ తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. వారందర్నీ సన్మానించారు. అందులో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కు మాత్రం ఈ విజయ శంకును గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా చెప్పిన అశ్వినీ దత్ ఎమోషనల్ అయ్యారు. ఇంద్రడై, దేవేంద్రుడై.. ఇంద్ర విజయాన్ని పూరించింది ముమ్మాటికి చిరంజీయే నని తన ఎక్స్ పోస్ట్ లో రాసుకొచ్చారు. అలాంటి చిరంజీవి ఇచ్చిన ఈ కానుక అమూల్యమని.. ఈ జ్ఙాపకం అపురూపమని.. ఇదెప్పటికీ తన గుండెల్లో పదిలమని.. ఎమోషనల్‌గా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు అశ్వినీదత్.
03. nani: నా హృదయం ముక్కలైంది
మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటి ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలోనే సంచలనంగా మారింది. అయితే ఈ కమిటి రిపోర్ట్‌పై సెలబ్రిటీల నుంచి రియాక్షన్ మాత్రం కరువైంది. ఇలాంటి ఈక్రమంలోనే స్టార్ హీరో నాని హేమ రిపోర్ట్ పై రియాక్టయ్యారు. రిపోర్ట్‌లోని విషయాలు చూసి తన హృదయం ముక్కలైందని అన్నారు. సినిమాల్లో రాణించాలని వస్తున్న మహిళలకు.. ఇక్కడ అనువైన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు నాని. అది అందరి బాధ్యతని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాదు తన సినిమాల్లో సెట్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఈ సందర్బంగా కాస్త గట్టిగా చెప్పారు ఈ స్టార్.
04. nag: కూల్చివేతపై కింగ్ సీరియస్
ఎన్ కన్వెషన్ సెంటర్‌ను కూల్చేయడం పై నాగ్ సీరియస్ గా రియాక్టయ్యారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్దంగా కూల్చేశారన్నారు నాగ్. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని.. ఇది పట్టా భూమని ఆయన చెప్పారు. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని.. ప్రైవేట్ ల్యాండ్‌లోనే తాము తమ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు చెప్పారు. అంతేకాదు కూల్చివేస్తున్నట్టు అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని.. అధికారుల తీరుపై నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంగా కోర్టును ఆశ్రయిస్తా అంటూ.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు నాగ్.
05.ruhani : శృంగార సీన్లు లీక్.! షాక్‌లో హీరోయిన్
ఆగ్రా మూవీలోని తన ఇంటిమసీ సీన్లు నెట్టింట లీక్ అవ్వడం పై ఆవేదన వ్యక్తం చేశారు హీరోయిన్ రుహాని శర్మ. కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని అని.. అది అర్థం చేసుకోకుండా..అందరూ తప్పుగా మాట్లాడం బాధ కలిగించిందన్నారు. ఈ మూవీని ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారని.. అది ఎంతో గొప్ప విషయమని తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ నోట్ లో రాసుకొచ్చారు ఈమె.
06. indra: ఇంద్ర కలెక్షన్స్ రికార్డ్
ఇంద్ర సినిమా రీ రిలీజ్ లోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. మెగా స్టార్ చిరు బర్త్ డే కానుకగా.. మోస్ట్ అవేటెడ్ రీ రిలీజ్ సినిమాగా రిలీజ్ అయిన ఇంద్ర సినిమా.. డే వన్ వన్ వరల్డ్ వైడ్ 3.05 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
07.kriti: కావాలనే నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు కృతి ఎమోషనల్.
ఓ రెండు మూడు రోజుల నుంచి ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి.. మెగా స్టార్ చిరు సినిమాను రిజెక్ట్ చేసిందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా.. కృతి షెట్టి తీరును తప్పుబట్టేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై రియాక్టైంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇంతటితోనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
08. tg: శర్వానంద్ ‘మనమే’ విషయంలో మోసపోయాం..
శర్వానంద్ మనమే సినిమా విషయంలో మోసపోయాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ టీజ విశ్వప్రసాద్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మనమే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఓటీటీలోకి రాకుండా ఉంది. అయితే అభిమానులు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట కామెంట్ చేస్తున్న క్రమంలోనే.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో.. ఓ సంస్థ చేతిలో మెసోయాం అంటూ చెప్పారు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. ఈ కారణంగానే ఈ సినిమా ఓటీటీ హక్కులు ఆ సంస్థ చేతిలోనే లాక్ అయినట్టు చెప్పారు ఈయన.
09.sradha: కలెక్షన్స్‌లోనే కాదు.. పాలోవర్స్‌లోనూ రికార్డ్ క్రియేట్ చేసిన బ్యూటీ.
ఇప్పుడు సోషల్ మీడియానే కాదు.. అక్రాస్ ఇండియా మొత్తం శ్రద్దా కపూర్ వేపే చూస్తోంది. ఎందుకంటే.. రీసెంట్‌గా తన క్రేజ్‌తో.. ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్‌లో.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీనే బీట్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు అదే జోష్‌లో.. 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక చోప్రాను కూడా దాటేసింది. 91.9 మిలియన్ ఫాలోవర్స్‌తో.. ఇండియలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల లిస్టులో.. సెకండ్ ప్లేస్‌ను దక్కించుకుంది. 271 మిలియన్ ఫాలోవర్స్‌తో ఈ లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ వైపు అడుగులు వేస్తోంది. అంతేకాదు తన రీసెంట్ ఫిల్మ్ స్త్రీ2తో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు ఈ సినిమాతో మొత్తంగా.. 456కోట్లను కొల్లగొట్టింది శ్రద్దా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.