Viral News: రెండేళ్ళ కూతురుని తీసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో బాయ్..

క్రెచ్ సౌకర్యాలు లేదా డేకేర్ కి తమ పిల్లలని పంపించే ఆర్ధిక పరిస్తితి లేనప్పుడు.. ఆ సింగిల్ పేరెంట్స్ కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఢిల్లీలో ఓ జొమాటో డెలివరీ బాయ్ తన రెండేళ్ల కుమార్తెను తన ఒడిలో పెట్టుకుని ఆర్డర్ కి సంబంధించిన ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టోర్ మేనేజర్ దీన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. లింక్డ్‌ఇన్‌లో సోను చిత్రంతో హృదయానికి హత్తుకునే కథను పంచుకున్నారు. అతని కథ చదివిన అందరూ భావోద్వేగానికి లోనయ్యారు.

Viral News: రెండేళ్ళ కూతురుని తీసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో బాయ్..
Viral NewsImage Credit source: LinkedIn/@DevendraMehra
Follow us

|

Updated on: Sep 04, 2024 | 5:03 PM

సింగిల్ పేరెంట్స్ గురించి వారు పిల్లలని పెంచడంలో పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంటరి తల్లిదండ్రులకు ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు పిల్లల సంరక్షణ బాధ్యతను సమతుల్యం చేసుకోవడం కష్టమే. ముఖ్యంగా క్రెచ్ సౌకర్యాలు లేదా డేకేర్ కి తమ పిల్లలని పంపించే ఆర్ధిక పరిస్తితి లేనప్పుడు.. ఆ సింగిల్ పేరెంట్స్ కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఢిల్లీలో ఓ జొమాటో డెలివరీ బాయ్ తన రెండేళ్ల కుమార్తెను తన ఒడిలో పెట్టుకుని ఆర్డర్ కి సంబంధించిన ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టోర్ మేనేజర్ దీన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. లింక్డ్‌ఇన్‌లో సోను చిత్రంతో హృదయానికి హత్తుకునే కథను పంచుకున్నారు. అతని కథ చదివిన అందరూ భావోద్వేగానికి లోనయ్యారు.

డెలివరీ బాయ్ సోను తన చిన్నారి కుమార్తెను తన ఒడిలో పెట్టుకుని న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ఉన్న స్టార్‌బక్స్‌లో ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ స్టార్‌బక్స్ స్టోర్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా తల్లిదండ్రి తానై బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనుని చూశాడు. అతని హృదయం ద్రవించింది.. ఇందుకు సంబంధించిన వార్తను తను లింక్డ్‌ఇన్‌లో రాశాడు, ఈ డెలివరీ బాయ్ కథ మా హృదయాలను తాకింది. అతను సింగిల్ పేరెంట్. ఇంట్లో ఎన్నో సవాళ్లు ఎదురైనా రెండేళ్ల కూతురిని చూసుకుంటూ కష్టపడుతున్నాడు. సోనూ అంకితభావం ఎవరికైనా స్ఫూర్తినిస్తుంది.

Delivery Boy Sonu

ఇవి కూడా చదవండి

అంతేకాదు దేవేంద్ర ఇంకా ఇలా వ్రాశాడు.. చిన్నారి బేబీకి తాము స్వీట్ ఇచ్చినప్పుడు ఆ పసి బిడ్డ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. అయితే సోనూ తన బిడ్డకు కష్టకాలంలో కూడా బాధ్యతల నుంచి తప్పుకోకూడదని నేర్పిస్తాడని దేవేంద్ర చెప్పారు. అంతేకాదు సోనూకి అతని కుమార్తెకు శుభాకాంక్షలు.

ఈ సింగిల్ పేరెంట్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒంటరి తల్లిదండ్రుల అవసరాలకు మద్దతుగా ఉండాలనే వాస్తవాన్ని దేవేంద్ర పోస్ట్ హైలైట్ చేసింది. స్టోర్ మేనేజర్ కి సంబధించిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ అయ్యింది. రకరకాల కామెంట్ల చేస్తున్నారు. సోనూ కథ హృదయాన్ని హత్తుకునేలా ఉందని నెటిజన్లు అభివర్ణించారు. పని పట్ల సోనూ అభిరుచి, అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..