Vande Bharat: వందే భారత్‌ రైల్లో ఫుడ్‌ని 5 స్టార్‌ హోటల్‌తో పోల్చిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఓ ఆట ఆడేసుకున్న నెటిజన్లు

సెమీస్పీడ్‌తో దేశ వ్యాప్తంగా తిరుగుతోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ రైళ్లలో అందించే ఫుడ్‌పై గత కొన్ని రోజులుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వందేభారత్‌ రైళ్లలోని ఫుడ్‌ను 5 స్టార్‌ హోటళ్లలోని టేస్ట్‌తో పోల్చాడు. అంతే నెటిజన్లంతా ఒక్కసారిగా తగులుకున్నారు..

Vande Bharat: వందే భారత్‌ రైల్లో ఫుడ్‌ని 5 స్టార్‌ హోటల్‌తో పోల్చిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఓ ఆట ఆడేసుకున్న నెటిజన్లు
Vande Bharat Train Food
Follow us

|

Updated on: Sep 04, 2024 | 7:16 PM

సెమీస్పీడ్‌తో దేశ వ్యాప్తంగా తిరుగుతోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ రైళ్లలో అందించే ఫుడ్‌పై గత కొన్ని రోజులుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వందేభారత్‌ రైళ్లలోని ఫుడ్‌ను 5 స్టార్‌ హోటళ్లలోని టేస్ట్‌తో పోల్చాడు. అంతే నెటిజన్లంతా ఒక్కసారిగా తగులుకున్నారు.

సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో టికెట్‌ ధరలే కాదు.. లోపల అందించే ఫుడ్‌ ధర కూడా మోతమోగిపోతుంది. అయితే ధర అధికంగా ఉన్నా ఫుడ్‌ మాత్రం సరిగా ఉండటం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శశాంక్ గుప్తా వందే భారత్‌ రైల్లో ఉదయపూర్ నుంచి ఆగ్రాకు ప్రయాణించాడు. అయితే ప్రయాణ సమయంలో పోహా, కట్‌లెట్‌లు, ఆలూ సబ్జీతో పాటు పెరుగు, నమ్‌కీన్ ప్యాకెట్, చోకో-పై డెజర్ట్‌తో కూడిన ఫుడ్ ట్రేని కొనుగోలు చేశాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం సోషల్ మీడియాలో ఫుడ్‌ టేస్ట్ గురించి చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. అందులో.. ‘ఈ రోజు నేను రైలు నెం -20981 ఉదయపూర్ – ఆగ్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. ఈ రైలులోని ఆహారం రుచి పరంగా ఏ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువ కాదనే’ క్యాప్షన్‌తో తాను కొనుగోలు చేసిన ఫుడ్ ప్లేట్‌ను ఫొటో తీసి తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

వందే భారత్‌ రైల్లోని ఫుడ్‌ని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ టేస్ట్‌తో పోల్చడంపై విమర్శిస్తున్నారు. తన అభిప్రాయం సరైంది కాదని, ఈ సమీక్షను పోస్ట్‌ చేసేందుకు అతనికి డబ్బు చెల్లించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.’ఇది 5-స్టార్ ఫుడ్ అయితే నేను షారుక్ ఖాన్’ అని ఒకరు, ‘అయితే నీ జీవితంలో ఒక్కసారి కూడా 5 స్టార్ హోటల్‌కి వెళ్లలేదన్నమాట’ అని మరొకరు, ‘ఇది ఏ రకంగ ఇది ఫైవ్‌ స్టార్‌ ఫుడ్‌ టేస్ట్‌ అనిపిస్తోంది’ అని ఇంకొకరు, ‘ఎవరైనా ముందు నిన్ను మంచి రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలి..!’అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం శశాంక్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక ఇతగాడి రివ్యూపై ఐఆర్‌సీటీసీ కూడా స్పందిస్తూ.. ఫుడ్‌ రివ్యూపై సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
12 మ్యాచ్‌ల్లో 499 పరుగులు.. కట్‌చేస్తే.. ఢిల్లీ డైనమేట్‌పై కన్ను
12 మ్యాచ్‌ల్లో 499 పరుగులు.. కట్‌చేస్తే.. ఢిల్లీ డైనమేట్‌పై కన్ను
రేపట్నుంచి 'ఏపీ టెట్‌ 2024' ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు..
రేపట్నుంచి 'ఏపీ టెట్‌ 2024' ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు..