AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ ఇది.. కానీ దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఎక్కడుందంటే..

అద్భుతమైన భవనాల విషయానికి వస్తే అందరి మనసు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వైపు వెళుతుంది. కానీ, ఉత్తర కొరియాలోని ఒక అద్భుతమైన భవనం గురించి తెలిస్తే మీరు భయంతో వణికిపోతారు. షాక్‌ అవుతారు. ఎందుకంటే.. ఈ భవనం దురదృష్టానికి చిహ్నంగా చెబుతారు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని ఈ భవనాన్ని చూస్తుంటే ఈజిప్షియన్ పిరమిడ్‌లను గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే దీని డిజైన్ పిరమిడ్‌ను పోలి ఉంటుంది. కానీ, ఇదేదో సమాధి మాత్రం కాదు.. ఇది ఒక హోటల్.. పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ ఇది.. కానీ దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఎక్కడుందంటే..
World Highest Hotel
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2025 | 11:18 AM

Share

ఈ హోటల్ ఎత్తు స్టాట్యూ ఆఫ్ యూనిటీ కంటే రెండు రెట్లు ఎక్కువ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు 182 మీటర్లు, ఈ హోటల్ ఎత్తు 330 మీటర్లు. ఇది 105 అంతస్తులు కలిగి ఉంది. బయటి నుండి చాలా విలాసవంతంగా కనిపించే ఈ హోటల్, ఇప్పటికీ తన మొదటి అతిథి కోసం ఆరాటపడటం దురదృష్టకరం. అవును, ఇప్పటివరకు ఇక్కడికి ఏ ఒక్క అతిథి కూడా రాలేదు.

పెద్ద కలలు, ప్రణాళికలతో నిర్మించబడిన ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్. కానీ నేడు ఇది ఒక నిర్జన భవనంగా నిలిచిపోయింది. దీని వెలుపలి భాగంలో LED లైట్లను అమర్చారు. వీటిని ప్రధాన జాతీయ కార్యక్రమాల సమయంలో ప్రచార సామాగ్రి, చిహ్నాలతో రాత్రిపూట ప్రదర్శనలకు ఉపయోగిస్తారు. ఇంత అద్భుతమైన భవనం ఉన్నప్పటికీ, ఇక్కడికి అతిథులు ఎందుకు రాలేదు అనే సందేహం మీకు తప్పక కలిగే ఉంటుంది. ఆ కారణం ఏంటంటే…

ఈ భవనం లోపల పనులు ఇంకా పూర్తి కాకపోవడమే ప్రారంభోత్సవానికి అడ్డుగా మారింది. ఈ భవనం బయటి నుండి మాత్రమే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ, లోపల మాత్రం ఇప్పటికీ చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దాంతో ఈ ఎత్తైన, సుందరమైన భవనం ఇంకా నిర్మానుష్యంగా ఉంది. ఇంతకీ ఈ భవన నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే…

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం, ఈ భవన నిర్మాణం 1987లో ప్రారంభమై 1992లో పూర్తయింది. కానీ, సోవియట్ యూనియన్ పతనం తర్వాత సహాయం ఆగిపోయినందున ఆర్థిక సంక్షోభం కారణంగా పని ఆగిపోయింది. 2008లో ఒక ఈజిప్షియన్ కంపెనీ $180 మిలియన్ల బాహ్య గాజు, అల్యూమినియం క్లాడింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది 2011లో పూర్తయింది. అప్పటి నుండి హోటల్‌కు ఇంటీరియర్ పని అవసరం అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..