AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పాములకు విషమిచ్చి చంపేస్తున్న సాలీడులు.. జుర్రుకుంటూ తినేస్తున్న వైనం.!

సాలెపురుగును పాము చంపి తినడం మీరందరూ చూసి ఉంటారు.. కానీ ఆ సాలెపురుగు.. పామును చంపడం మీరెప్పుడైనా చూశారా.? ఇదెలా సాధ్యమని ఆలోచిస్తున్నారా.!

Viral News: పాములకు విషమిచ్చి చంపేస్తున్న సాలీడులు.. జుర్రుకుంటూ తినేస్తున్న వైనం.!
Spider
Ravi Kiran
|

Updated on: Jun 28, 2021 | 7:22 PM

Share

సాలెపురుగును పాము చంపి తినడం మీరందరూ చూసి ఉంటారు.. కానీ ఆ సాలెపురుగు.. పామును చంపడం మీరెప్పుడైనా చూశారా.? ఇదెలా సాధ్యమని ఆలోచిస్తున్నారా.! నిజమండీ సాలీడులు పాముకు విషమిచ్చి మరీ చంపేస్తున్నాయి. ఆ తర్వాత వాటిని ద్రవరూపంలో మార్చేసి జుర్రేసుకుంటున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పాములు.. ఈ పేరు వింటేనే మనుషులు భయభ్రాంతులకు గురవుతారు. అది కనిపిస్తే చాలు.. వాటి దరిదాపుల్లో కూడా కనిపించరు. అంటార్కిటికా మినహా ప్రపంచమంతా పాములు విస్తరించిన సంగతి తెలిసిందే. సుమారు 2900 జాతులు పాముల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో చాలావరకు విషపూరితమైనవి కాగా.. అవి ఒక్క కాటుతోనే ఏ జంతువునైనా గంటల్లో మృత్యువు ఒడికి చేర్చగలవు. అయితే అంతటి విషసర్పాలను.. ఒక్క కాటుతో విషమిచ్చి మరీ సాలెపురుగులు చంపి తింటున్నాయి. ఆ తర్వాత వాటిని ద్రవరూపంలో మార్చేసి జుర్రేసుకుంటున్నాయి.

విడోస్ స్పైడర్ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను తినేస్తున్నట్లు స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ అఫ్ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్‌పర్ట్‌ మార్టిన్‌ నీఫ్‌లర్‌ వెల్లడించారు. పాము, సాలెపురుగు మధ్య యుద్ధం జరిగితే.. 87 శాతం సాలెపురుగే పైచేయి సాధిస్తుందని ఆయన అన్నారు. దాదాపు సాలెపురుగు, పాము మధ్య జరిగిన 300 సంఘటనలు పరిశీలించిన నీఫలర్.. ఆయా ఘటనలలో గెలవని పాములు, ఎవరైనా వచ్చి రక్షిస్తేనే బతికి బయటపడ్డాయని స్పష్టం చేశారు.

థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగు.. తాను తయారు చేసుకున్న సాలెగూళ్లలో భారీ కాయంతో ఉండే పాములు చిక్కుకోగానే.. వాటికి విషాన్ని ఎక్కిస్తుంది. దానితో ఆ పాములు పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. ఆ తర్వాత పాము శరీర భాగాలను ద్రవ రూపంలో మార్చేసి తినేస్తుందని మార్టిన్ చెప్పుకొచ్చారు.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి