AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ బాబోయ్.. పాకిస్థాన్‌కు పండగ తెచ్చిన గాడిదలు.. ఎలాగంటే..?

మనం ఎగతాళిగా వాడే "ఎందుకూ పనికిరాని గాడిద" అనే మాటను ఇప్పుడు మార్చి రాస్తోంది పాకిస్థాన్. ప్రస్తుతం గాడిదలు ఆ దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మారాయి. పాకిస్థాన్‌లోని గాడిదలు ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సాయపడుతున్నాయి. మిత్రదేశమైన చైనాకు గాడిదల మాంసం, చర్మాన్ని ఎగుమతి చేస్తూ పాకిస్థాన్ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది.

అమ్మ బాబోయ్.. పాకిస్థాన్‌కు పండగ తెచ్చిన గాడిదలు.. ఎలాగంటే..?
Why Pakistan Donkeys Are In Demand In China
Sharada V
|

Updated on: Sep 16, 2026 | 1:44 PM

Share

ఈ వ్యాపారం కోసం బలూచిస్థాన్ సమీపంలోని గ్వాదర్‌లో ఒక భారీ స్లాటర్ హౌజ్ (జంతు వధాశాలను) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రతిరోజూ వందలాది గాడిదలను వధించి, వాటి మాంసం, చర్మాలను ఎప్పటికప్పుడు చైనాకు తరలిస్తున్నారు.

‘ఇజియావో’ కోసం గాడిదల వధ

చైనాలో గాడిద మాంసం, చర్మానికి మంచి డిమాండ్ ఉంది. అక్కడి ప్రజలు గాడిద మాంసాన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, వాటి చర్మంతో తయారయ్యే ‘ఇజియావో’ అనే  జిగురు పదార్థాన్ని ఔషధంగా భావించి రోగనిరోధక శక్తిని పెంచడానికి, నిద్రలేమి సమస్యకు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో చైనాలో గాడిదలను విపరీతంగా వాడటంతో వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకే చైనా తన అవసరాల కోసం పొరుగు దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది.

చైనాలో  ‘ఇజియావో’ కోసం గాడిదలను విపరీతంగా చంపేయడంతో వాటి సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో చైనా కంపెనీలు పాకిస్థాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. 2023 నాటి యూఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 23 లక్షల నుంచి 48 లక్షల గాడిదలను కేవలం చర్మం కోసమే చంపుతున్నారు.  చైనాలో ‘ఇజియావో’ మార్కెట్ విలువ అత్యధికంగా  7.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

గతంలో ఆఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్

గతంలో చైనాకు ప్రధానంగా గాడిదలను సరఫరా చేసిన ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ఆ ఎగుమతులపై  ఆంక్షలు విధిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆఫ్రికా దేశాల స్థానాన్ని భర్తీ చేస్తూ.. పాకిస్థాన్ ఈ గ్లోబల్ మార్కెట్‌లో కీలక దేశంగా మారుతోంది. పాకిస్థాన్‌కు ఈ వ్యాపారం పెద్ద వరంగా మారింది. అక్కడ మత విశ్వాసాల కారణంగా ఎవరూ గాడిద మాంసం తినరు. దీనివల్ల పాక్‌లో గాడిదల సంఖ్య పెరిగి ఏకంగా 60 లక్షలకు (6 మిలియన్లు) చేరుకుంది. ఈ గాడిదలను చైనాకు ఎగుమతి చేస్తూ పాకిస్థాన్ ఆర్థికంగా బలపడుతోంది. బలూచిస్థాన్‌లో ఏర్పాటు చేసిన జంతు వధాశాలను (స్లాటర్ హౌస్‌ను) ప్రస్తుతం ఒక చైనా కంపెనీయే చూసుకుంటోంది. ఈ వ్యాపారం ద్వారా త్వరలోనే నెలకు రూ.47 కోట్లు, మరో రెండేళ్లలో నెలకు రూ.67 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆ కంపెనీ చీఫ్ ఆండీ లియావో తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ‘హ్యాంగెంగ్ గ్రూప్’ సంస్థ దాదాపు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 480 కోట్లు) పెట్టుబడి పెట్టింది. దీనివల్ల స్థానికంగా 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఇప్పటికే కొన్ని కంటైనర్ల మాంసం, చర్మాలను ఎగుమతి చేయగా, తొలి షిప్‌మెంట్ గత జూన్‌లోనే చైనాకు చేరుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.

Follow Us
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!