E-Rickshaw Driver: 15 క్వశ్చన్లకు ఆన్సర్ చెబితే.. ఆటోలో ఫ్రీగా ప్రయాణం.. రిక్షావాలా జ్ఞానానికి నెటిజన్ల ఫిదా..
West Bengal E-Rickshaw Driver: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు తెరపైకి వస్తుంటాయి. వాటిలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే.. తాజాగా నెట్టింట ఈ రక్షావాలా
West Bengal E-Rickshaw Driver: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు తెరపైకి వస్తుంటాయి. వాటిలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే.. తాజాగా నెట్టింట ఈ రక్షావాలా గురించి చర్చనీయాంశంగా మారింది. ఇ-రిక్షావాలా జ్ఞానానికి.. అందరూ ఫిదా అవుతున్నారు. వాస్తవానికి అతని రిక్షా ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులకు అతను జీకేకి సంబంధించిన 15 ప్రశ్నలడుగుతాడు.. సరైన సమాధానం చెబితే వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా గమ్యస్థానానికి చేర్చుతాడు. ఇదంతా వింతగా అనిపిస్తుంది కదా.. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణానికి చెందిన ఈ రిక్షావాలా.. తన తీరుతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారియి.
బెంగాల్‌లోని హౌరా జిల్లా లిలుహ్లోని ఈ రిక్షా డ్రైవర్ సురంజన్ కర్మాకర్.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా గమ్యస్థానానికి చేర్చుతానంటూ ప్రయాణికులకు చెబుతుంటాడు. ఈ క్రమంలో సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్ ఈ రిక్షా దగ్గరికి వస్తారు. ఈ క్రమంలో సురంజన్ తాను అడిగే 15 జీకే ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఉచితంగా తీసుకువెళ్తానంటూ హామీనిస్తాడు. వారు నిజమో కాదో చూద్దాం అనుకుంటూ అతని ఆటో ఎక్కుతారు. ఆ తర్వాత సురంజన్ ప్రశ్నలను ఒక్కొక్కటి అడగటం మొదలుపెడతాడు. జీకేలో అన్నింటిని టచ్ చేసుకుంటూ సురంజన్ ప్రశ్నలను అడుగుతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్ మాత్రం మొదటగా రిక్షావాలా చెప్పిన మాటలను నమ్మలేదు. అదనపు ఛార్జీల కోసం ప్రయాణికులను ఇలా అడుకుంటున్నాడని అనుకుంటాడు.
అయితే ఈ క్విజ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ సురంజన్.. మాట్లాడిన మాటలను ప్రయాణికుడు సంకలన్ సర్కార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ-రిక్షావాలా గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఆరవ తరగతి వరకు చదువుకున్నానని.. అయితే తనకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉందని సురంజన్ తెలిపాడు. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా కూడా ఉన్నట్లు వెల్లడించాడు. తన మీద నమ్మకం కలగకపోతే.. తనను గూగుల్‌లో అద్భుత్ తోటివాలాగా కూడా చూడవచ్చు అంటూ సురంజన్ సంకలన్ దంపతులతో పేర్కొన్నాడు.
అయితే.. ప్రయాణం అనంతరం సురంజన్ గురించి.. సంకలన్ సర్కార్ ఈ విషయం గురించి క్లుప్తంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట అతని గురించి తెగ వైరల్ అవుతోంది. ఇ-రిక్షావాలా జ్ఞానానికి అందరూ ఫిదా అవడంతోపాటు.. ప్రశంసిస్తున్నారు.
Also Read: