Bride Dharna: మరికాసేపట్లో పెళ్లి.. హ్యాండిచ్చిన వరుడు.. ధర్నాకు దిగిన వధువు.. అసలేమైందంటే..?

Bride Dharna at groom’s home: ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి తేదిని కూడా నిర్ణయించారు. ఆ తర్వాత పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు

Bride Dharna: మరికాసేపట్లో పెళ్లి.. హ్యాండిచ్చిన వరుడు.. ధర్నాకు దిగిన వధువు.. అసలేమైందంటే..?
Bride Dharna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 23, 2021 | 4:57 PM

Bride Dharna at groom’s home: ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి తేదిని కూడా నిర్ణయించారు. ఆ తర్వాత పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు ముస్తాబై కల్యాణ మండపానికి కూడా చేరింది. కానీ వరుడు మాత్రం అక్కడికి చేరుకోలేదు. వరుడికి ఫోన్ చేసినా సమాచారం లేకపోవడంతో.. ముస్తాబైన పెళ్లి కూతురు వరుడు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ షాకింగ్ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్‌లో చోటు చేసుకుంది. బెర్హంపూర్ పట్టణానికి చెందిన వధువు డింపుల్ డాష్, అదే పట్టణానికి చెందిన వరుడు సుమీత్ సాహులు కొంతకాలం క్రితం రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరుకుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అందరి సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా వధువు డింపుల్ వివాహ దుస్తులు ధరించి కల్యాణ మండపానికి వద్దకు వచ్చింది. కానీ వరుడు మాత్రం రాలేదు. దీంతో వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులు గంటల తరబడి వేచిచూశారు.

వరుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. వధువు డింపుల్ అత్తమామల ఇంటికి వెళ్లి ధర్నా చేసింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకోని వివరాలు సేకరించారు. విచారణలో వధువు పలు విషయాలను వెల్లడించింది. తాము 2020 సెప్టెంబరు 7వతేదీన రిజిస్టర్ పెళ్లి చేసుకున్నామని.. మొదటి రోజు నుంచి తన అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు తనకు మద్దతుగా నిలిచిన భర్త.. కూడా తనపై దాడి చేసేవాడని, లైంగికంగా వేధించడం ప్రారంభించాడని తెలిపింది. అనంతరం తాను పుట్టింటికి వెళ్లానని.. ఈ ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

ఆ తర్వాత తన అత్తమామ ఇంటికి వచ్చి హిందూ ఆచారాల ప్రకారం వివాహ వేడుక నిర్వహించమని అడగడంతో.. తన తల్లిదండ్రులు ఒప్పుకున్నారని పేర్కొంది. పెళ్లికి నవంబర్ 22వ తేదీన ముహూర్తం నిర్ణయించారని.. వరుడు మాత్రం కల్యాణ వేదిక వద్దకు రాలేదని వధువు డింపుల్ ఆవేదన వ్యక్తంచేసింది. తనను లైంగింకంగా వేధించాడని.. ఇప్పుడు మోహం చాటేసినట్లు వెల్లడించింది. కాగా.. ఈ ఘటనపై బెర్హంపూర్ ఎస్పీ పినాక్ మిశ్రా స్పందించారు. గతంలో కూడా ఈ జంటపై కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ స్కీం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..

Covid-19: జైపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌.. స్కూల్‌ మూసివేత..