Disha Encounter Case Update: దిశ నిందితుల్లో మైనర్లున్నారా?.. సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణలో వెలుగులోకి సంచలనాలు!

Sirpurkar Commission Report: రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించి దిశ కేసులో విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దిశ నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్‌ కోటా పేర్కొన్నారు.

Disha Encounter Case Update: దిశ నిందితుల్లో మైనర్లున్నారా?.. సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణలో వెలుగులోకి సంచలనాలు!
Disha Encounter Case Update
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2021 | 3:47 PM

Sirpurkar Commission on Disha Encounter: రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించి దిశ కేసులో విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దిశ నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్‌ కోటా పేర్కొన్నారు. వారికి సంబంధించిన రికార్డులు అన్నింటిలోనూ మేజర్లే ఉన్నట్లు వెల్లడించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట సోమవారం ఆయన వాదనలు వినిపించారు. నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.

షాద్ నగర్ టోల్ గేట్ ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించింది. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు నిందితుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ నలుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అయితే, నిందితులు కాల్పులు జరపడంతో గత్యంతరం లేని స్థితిలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ దిశ అత్యాచారం జరిగినప్పటి నుంచి ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వారిని అరెస్టు చేసినప్పుడు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు 40వేల మంది ప్రజలు చేరుకున్నారని, నిందితులను తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారన్నారు. చివరకు చర్లపల్లి జైలుకు తరలించినప్పుడు కూడా అక్కడకీ జనం చేరుకున్నారని, అందుకే వారికి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే సేఫ్‌హౌస్‌లో ఉంచారని కమిషన్‌కు తెలిపారు. ప్రజల దృష్టిలో పడకూడదనే ఆలోచనతోనే తెల్లవారుజామున నేరస్థలానికి తీసుకెళ్లారని తెలిపారు. సాక్షులు, లారీ యజమాని చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారని తెలిపారు. అనంతరం విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Read Also….  PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ స్కీం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. 

Covid-19: జైపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌.. స్కూల్‌ మూసివేత..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..