Hyderabad: మరో ఘోరం.. భర్తకు మ‌ద్యం తాగించి భార్యపై అత్యాచారం.. ఆ తర్వాత దారుణంగా..

Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు.. ఓ వ్యక్తికి పీకల దాక మద్యం తాగించి.. అతని భార్యపై అఘాయిత్యానికి

Hyderabad: మరో ఘోరం.. భర్తకు మ‌ద్యం తాగించి భార్యపై అత్యాచారం.. ఆ తర్వాత దారుణంగా..
Crime News

Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు.. ఓ వ్యక్తికి పీకల దాక మద్యం తాగించి.. అతని భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఆమెను దారుణంగా హత్యచేశారు. ఈ దారుణ ఘటన హ‌య‌త్‌న‌గ‌ర్‌కు స‌మీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామ‌తిపేట్‌లో జ‌రిగింది. తారామ‌తిపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగ‌ళ‌వారం రాత్రి ఇద్దరు దుండ‌గులు ఫుల్లుగా మ‌ద్యం తాగించారు. అతిగా సేవించ‌డంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. అనంతరం అత‌ని భార్యపై ఇద్దరు దుండ‌గులు అత్యాచారం చేసి చంపారు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

కాగా.. అదే గ్రామానికి చెందిన సురేశ్‌, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మొదట సురేష్, శ్రీకాంత్ ఇద్దరు కలిసి బాధితుడు ఇంటికి మద్యం చేరుకుని అక్కడే తాగినట్లు వెల్లడైంది. ఈ ఘటన అనంతరం పోలీసులు సురేశ్‌ను అరెస్టు చేశారు. శ్రీకాంత్ ప‌రారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Gas Cylinder Blast: తమిళనాడులో భారీ పేలుడు.. కుప్ప కూలిన మూడు ఇళ్లు.. శిథిలాల కింద జనాలు..

Grape Wine From Sea: ఆ వైన్ రుచిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఇలా చేస్తారట..

Click on your DTH Provider to Add TV9 Telugu