AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందరూ నిద్రిస్తుండగా అనుకోని అలజడి.. ఒక్కసారిగా ఊహించని షాక్.. భయంతో గుండెలు హడల్!

Viral Video: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వరదలు కారణంగా పంట పొలాలు, లంక గ్రామాలు జలమయమవుతున్నాయి...

Viral Video: అందరూ నిద్రిస్తుండగా అనుకోని అలజడి.. ఒక్కసారిగా ఊహించని షాక్.. భయంతో గుండెలు హడల్!
Snake
Ravi Kiran
|

Updated on: Nov 23, 2021 | 3:58 PM

Share

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వరదలు కారణంగా పంట పొలాలు, లంక గ్రామాలు జలమయమవుతున్నాయి. అలాగే జంతువులు, విషసర్పాలు తమ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందటం కామన్. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం..

పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందుకు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. మీరు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడో లేకపోతే అందరూ కలిసి సరదాగా టీవీ చూస్తున్న టైంలోనో మీ ఇంట్లోకి నాగుపాము వస్తే.. ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి కదా. నిజంగా అలాగే జరిగింది. కుటంబసభ్యులంతా టీవీ చూస్తున్న సమయంలో ఓ భారీ నాగుపాము సరాసరి టీవీలో దూరిపోయింది. పామును చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని ఇందుపల్లిలో నవంబరు 22న ఓ ఇంట్లో భారీ నాగుపాము చొరబడింది. పామును చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో పాము సరాసరా వెళ్లి టీవీలో దూరిపోయింది. ఆ విషసర్పం ఎప్పుడు.? ఎవరి మీదకు వస్తోందో భయపడిన ఆ కుటుంబం.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. దీనితో అతడు అక్కడికి చేరుకొని ఎంతో చాకచక్యంగా పామును డబ్బాలో బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!