Rishi Sunak: విజయ్ మామా.. అంటూ రిషి సునాక్ అప్యాయ పలకరింపు.. నెట్టింట్లో ట్రెండింగ్..
బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ఎన్నికయ్యారు. ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో భారతీయులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నవయసులోనే బ్రిటన్ దేశ ప్రధానిగా రిషి సునాక్..
బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ఎన్నికయ్యారు. ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో భారతీయులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నవయసులోనే బ్రిటన్ దేశ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక కావడం పట్ల కన్జర్వేటివ్ పార్టీలో.. ఆ దేశంలో ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఇక్కడి నెటిజన్స్ కూడా రిషి సునాక్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ మామా అంటూ వీడియో కాల్ లో రిషి సునాక్ అప్యాయంగా పలకరించడం ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోను సెలబ్రిటీ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేశారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు అనేక అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది నిజం కాకపోవచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఎవరు ఈ విజయ్ మామా అని అడుగుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం సంజయ్ రైనా మాట్లాడుతూ.. మామా మీకు ఒకరు హలో చెప్తారు అనడంతో ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే కెమెరా రిషి సునాక్ వైపు మళ్లుతుంది. అప్పుడు రిషి సునాక్ విజయ్ మామా..హాయ్. నేను రిషి. మీరు ఎలా ఉన్నారు.. మీరు యూకే వచ్చినప్పుడు నన్ను కలుస్తారని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 10 డౌనింగ్ స్ట్రీట్‌కి తీసుకురామని మీ మేనల్లుడిని (రైనాను చూపిస్తూ..) అడగండి.. జాగ్రత్త’ అంటూ చెప్తారు. ఈ వీడియో షేర్ చేసిన సంజయ్ రైనా దీనికి ‘వీసా ఆన్ అరైవల్ పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పాతదే అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ మామా’ ఎవరు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సంజయ్ రైనా చేసిన ఈ వీడియో.. యూకే వీసా సమస్యలను ఉద్దేశించి సెటైరిక్‌గా చేసి ఉంటారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇక ఆ విజయ్ మామా ఎవరంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే ఒకరు మాత్రం విజయ్ మాల్యా అయ్యి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేయగా.. గుడ్ వన్ అంటూ నవ్వులు చిందించాడు సంజయ్ రైనా. మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రం రిషి సునాక్ హాయ్ మామా అంటూ మాట్లాడిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఏ సందర్భంలో తీసింది. అది నిజమేనా అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.
Visa on arrival ab pakka ??#RishiSunak pic.twitter.com/imSIhuEgKB
— Sanjay Raina (@sanjayraina) October 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..