AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dancing Woman: ఈ బామ్మగారు సూపర్ హిట్ సాంగ్ కు రవీనాకు మించి డ్యాన్స్… క్యా స్టెప్స్ హై అంటోన్న నెటిజన్లు

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక అత్తగారు రవీనా టాండన్ పాటకు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఆరుబటయ పచ్చికలో అందంగా ఓహొయలు పోతూ బామ్మగారు వేస్తోన్న స్టెప్స్ చాలా ప్రత్యేకం అనిపిస్తున్నాయి. 

Dancing Woman: ఈ బామ్మగారు సూపర్ హిట్ సాంగ్ కు రవీనాకు మించి డ్యాన్స్... క్యా స్టెప్స్ హై అంటోన్న నెటిజన్లు
Auntu Dance Video Viral
Surya Kala
|

Updated on: Oct 29, 2022 | 10:48 AM

Share

అభిరుచిని కొనసాగించడానికి వయస్సు లేదు. ఒక వ్యక్తి తన ఇష్టాలను కోరికలను ఏ వయస్సులో నైనా నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయవచ్చు. అవి నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే పిల్లలు, యువకులు తమకు ఇష్టమైన పనులు చేయడం మీరు తప్పక చూసి ఉంటారు. అయితే వయసు మళ్ళిన వారు కలలను బహిరంగంగా నెరవేర్చుకోవడానికి కొంచెం సందేహిస్తారు. తమ ఇష్టాన్ని కోరికను ఆసక్తిని బహిరంగంగా వెల్లడించే వృద్ధులను మీరు ఎప్పుడైనా చూశారా? తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధ మహిళ అద్భుతమైన నృత్యం చేస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మగారి డ్యాన్స్ స్టైల్ చూసి జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వయస్సు కేవలం ఒక సంఖ్య అని ప్రజలు చెప్పడం మీరు తరచుగా విని ఉంటారు. మనిషి తన ఆలోచనను బట్టి యూత్ లేక వృద్ధులా అనేది నిర్ణయించాలని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మనసులో అభిరుచి, ఏదైనా చేయాలనే తపన ఉంటే.. 60 ఏళ్ల వయస్సులో కూడా మనిషి ఏదైనా సాధించగలడు. ఇది నిజమని రుజువు చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కిసీ డిస్కో మే జాయే’ సాంగ్ కు ఒక అత్త అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ చూసిన వారికి కళలకు కావాల్సింది టాలెంట్ కానీ వయసుతో నిమిత్తం లేదని అర్ధం అవుతుందని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక అత్తగారు రవీనా టాండన్ పాటకు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఆరుబటయ పచ్చికలో అందంగా ఓహొయలు పోతూ బామ్మగారు వేస్తోన్న స్టెప్స్ చాలా ప్రత్యేకం అనిపిస్తున్నాయి.  అంతేకాదు డ్యాన్స్ స్టైల్ తో పాటు ఆమె ఎక్స్ ప్రెషన్స్  కూడా  జనాలకు చాలా నచ్చాయి.

View this post on Instagram

A post shared by sajida (@saj.khan.2310)

డ్యాన్స్‌లో, ఎక్స్‌ప్రెషన్స్‌లో రవీనాతో పోటీపడుతోంది ఈ బామ్మగారు. వీడియోను మళ్లీ మళ్లీ చూడాలనిపించే స్టైల్‌ లో డ్యాన్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో saj.khan.2310 అనే ఖాతా ద్వారా వీడియో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు, లైక్‌లు వచ్చాయి. బామ్మ గారు స్టైల్‌పై  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరో ఆంటీని అద్భుతం అని అంటే.. మరొకొందరు డ్యాన్స్ మూమెంట్స్ సూపర్బ్ అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై