Viral Video: అట్లుంటది ముచ్చట మనతోని.. పాముకే మస్కా కొట్టిన సాలీడు.. వీడియో చూస్తే షాకవుతారంతే!
సాధారణంగా పాములు చిన్న చిన్న కీటకాలను చంపి.. వాటిని తింటుంటాయి. అయితే ఎప్పుడైనా ఆ చిన్న కీటకం..
సాధారణంగా పాములు చిన్న చిన్న కీటకాలను చంపి.. వాటిని తింటుంటాయి. అయితే ఎప్పుడైనా ఆ చిన్న కీటకం.. పాముకు ముప్పుతిప్పలు పెడుతుందని ఊహించారా.? వినడానికే అసాధ్యంగా ఉంది కదూ.. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారంతే!.. ఓ చిన్ని సాలెపురుగు.. తన గూడులో ఎలా పామును ట్రాప్ చేసిందంటే..!
వైరల్ వీడియో ప్రకారం.. ఓ కారు టైర్‌పై బ్లాక్ విడో స్పైడర్ గూడు అల్లుకోగా.. ఎక్కడ నుంచి వచ్చిందో కాని.. సుమారు రెండు అడుగుల ఉన్న వాటర్ స్నేక్ వచ్చి అందులో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా.. అక్కడ నుంచి బయటకి రాలేకపోయింది. సైజ్‌లో తనకన్నా ఎక్కువైన పాముతో సాలీడు పోరుకు దిగడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. పాపం! సాలీడుని ఎరగా చేసుకునేందుకు వచ్చి.. తానే ఎరగా మారిపోయిందంటూ పాముపై జాలి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 35 వేలకు పైగా వ్యూస్ రాగా.. వీక్షకులు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కాగా, లేట్ ఎందుకు వీడియోపై మీరూ లుక్కేయండి.
View this post on Instagram