AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: హాయి హాయిగా.. లగ్జరీ కారులో షీకారు చేస్తున్న ఒంటె.. పాపం బాగా అలసిపోయిందేమో..!

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఏదో అరబ్ దేశానికి చెందినదిగా తెలుస్తోంది..అరబ్‌ వంటి ఎడారి దేశాల్లో ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. ఎడారుల్లో హాయిగా సాగిపోయే ఒంటే.. అలిసిపోతే ఏం చేస్తుంది..? ఎక్కడో ఒక చోట కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటుంది. అంతకు మించి ఏం చేస్తుంది..? కానీ, ఇక్కడ ఒక ఒంటె.. విలాసవంతమైన కారులో వెళ్తుండటం ప్రజల దృష్టిని ఆకర్షించింది.

Watch Video: హాయి హాయిగా.. లగ్జరీ కారులో షీకారు చేస్తున్న ఒంటె.. పాపం బాగా అలసిపోయిందేమో..!
Camel Sitting In Luxury Car
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2024 | 8:35 PM

Share

సోషల్ మీడియా అనే తమాషా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్‌ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు, పాములకు సంబంధించి అనేక వీడియోలు కనిపిస్తాయి. అలాగే, కొందరు మనుషులు చేసే వింతపనులు, విచిత్ర సంఘటనలు అనేకం కనిపిస్తాయి. వింత వంటకాలు, విచిత్ర వస్తువల తయారీ, జుగాఢ్‌ వీడియోలు అనేకం ఉంటాయి. అయితే, ఫన్నీ వీడియోలు ఇక్కడ ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని ఫన్నీ వీడియోలు నెటిజన్లను కడుపుబ్బిపోయేలా నవ్విస్తాయి. కొన్ని కొన్ని వీడియోలు చూస్తే అస్సలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ఏదో అరబ్ దేశానికి చెందినదిగా తెలుస్తోంది. ఇందులో రోడ్డుపై ఓ లగ్జరీ కారు వెళ్తుండగా, ఆ కారులో మనిషికి బదులు మరొకరు కూర్చొని కనిపించారు. ఆ కారులో ప్రయాణిస్తున్న వారిని చూసిన వారికి పొట్టచెక్కలవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఏదో అరబ్ దేశానికి చెందినదిగా తెలుస్తోంది..అరబ్‌ వంటి ఎడారి దేశాల్లో ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. ఎడారుల్లో హాయిగా సాగిపోయే ఒంటే.. అలిసిపోతే ఏం చేస్తుంది..? ఎక్కడో ఒక చోట కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటుంది. అంతకు మించి ఏం చేస్తుంది..? కానీ, ఇక్కడ ఒక ఒంటె.. విలాసవంతమైన కారులో వెళ్తుండటం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ కారు ఓనర్ తన కారు డిక్కీలోఒంటెను కూర్చోబెట్టినట్టుగా అర్థమవుతోంది.. ఫ్రేమ్‌లో ఉన్న సీన్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్‌ అవ్వాల్సిందే. కారులో కూర్చున్న ఆ ఒంటె కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అది తన మెడను బయటికి పెట్టి చుట్టూ పక్కల పరిసరాలను ఆస్వాదిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒంటె కారులో వెళుతున్న ఫన్నీ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకు వేల సంఖ్యలో వీక్షణలు సాధించింది. ఇది ఎవ్రీడే రీల్స్‌డే హ్యాండిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…