Watch Video: అరరే ఎంత పనైంది..! లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ అన్న ఆ చిన్న మాట..? ఆమెను చిక్కుల్లో పడేసిందిగా..

నిన్న మార్చి 25న దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ వీడియో వైరల్ అవుతోంది. సాయంత్రం 4 గంటల వరకు హోలీ ఆడిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని ఆమె ఈ వీడియోలో ప్రజలకు వివరిస్తున్నారు. లేనిపక్షంలో పోలీసులు..

Watch Video: అరరే ఎంత పనైంది..! లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ అన్న ఆ చిన్న మాట..? ఆమెను చిక్కుల్లో పడేసిందిగా..
Woman Si In Indore
Follow us

|

Updated on: Mar 26, 2024 | 6:19 PM

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. రంగులతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. భద్రతా చర్యల దృష్ట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా హోలీకి సంబంధించి ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ వీడియో హల్‌చల్‌ చేసింది. ఇండోర్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక పోలీసు స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు అధికారి రీల్ చేయడానికి మైక్‌లో ప్రకటనలు చేస్తూ కనిపించారు. సదరు మహిళా పోలీస్ ఆఫీసర్ రీల్ వైరల్ కావడంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. అనంతరం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిన్న మార్చి 25న దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌కు చెందిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ వీడియో వైరల్ అవుతోంది. సాయంత్రం 4 గంటల వరకు హోలీ ఆడిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని ఆమె ఈ వీడియోలో ప్రజలకు వివరిస్తున్నారు. లేనిపక్షంలో పోలీసులు లత్మార్ హోలీ నిర్వహిస్తారని ప్రకటించటం కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో న్యాయ విద్యార్థి ఒకరు ముఖ్యమంత్రికి, ఎన్నికల సంఘానికి ట్వీట్‌ చేశారు. లేడీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని డిమాండ్‌ చేశారు.. రాష్ట్ర ఆర్థిక రాజధాని ఇండోర్‌లోని మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nai Dunia (@nai__dunia)

సదరు లేడీ పోలీస్‌ ఆఫీసర్‌కు సంబంధించిన విషయం ఇండోర్‌లోని లసుడియా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినదని తెలిసింది. ఇక్కడ వీడియో పోస్ట్ చేసిన లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖుష్బూ పర్మార్ ప్రకటనలు చేస్తూ, హోలీ ఆడిన తర్వాత సాయంత్రం 4 గంటలకే ఇంటికి వెళ్లాలని ప్రజలకు వివరిస్తున్నారు. లేదంటే దీని తర్వాత లత్మార్ హోలీని పోలీసులు ఆడతారంటూ చెప్పటం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో, పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్‌పై చర్యలకు ఆదేశించినట్టుగా సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..