మగువలుగా మారిన మగవారు.. రతీ మన్మధులకు పూజలు
హొలీ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రంగులే. చిన్నా పెద్దా తేడా లేకుండా హోళీ రోజు రంగుల్లో మునిగి తేలుతారు. కానీ కొన్నిచోట్ల ఈ హోళీని విచిత్రంగా జరుపుతారు. అలా కర్నూలు జిల్లాలో హోళీవేళ పురుషులు స్త్రీలుగా మారి రతీమన్మధులకు పూజలు చేస్తారు. ఇది ఇక్కడి ఆచారం. జిల్లాలోని ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే మగవాళ్ళు చీరలు కట్టాల్సిందే.. గాజులు వేసుకోవాల్సిందే..
హొలీ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రంగులే. చిన్నా పెద్దా తేడా లేకుండా హోళీ రోజు రంగుల్లో మునిగి తేలుతారు. కానీ కొన్నిచోట్ల ఈ హోళీని విచిత్రంగా జరుపుతారు. అలా కర్నూలు జిల్లాలో హోళీవేళ పురుషులు స్త్రీలుగా మారి రతీమన్మధులకు పూజలు చేస్తారు. ఇది ఇక్కడి ఆచారం. జిల్లాలోని ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే మగవాళ్ళు చీరలు కట్టాల్సిందే.. గాజులు వేసుకోవాల్సిందే.. అవును అది ఇక్కడి సంప్రదాయం. హోళీ రోజు మగవారంతా ఆడవారికి ఏమాత్రం తీసిపోకుండా చీరలు కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని అందంగా ముస్తాబవుతారు. ఇది స్థానికంగా వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాదికూడా పెద్దసంఖ్యలో పురుషులు స్త్రీలుగామారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి పూజలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు
చైనా ఆయిల్ ట్యాంకర్‌పై 5 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం
విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు
లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

