చైనా ఆయిల్ ట్యాంకర్‌పై 5 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం
ఎర్ర సముద్రంలో చైనా, రష్యా వాణిజ్యనౌకలపై దాడి చేయబోమని హామీ ఇచ్చిన హౌతీ తిరుగుబాటుదారుల మాట తప్పారు. తాజాగా చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై ఐదు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ధ్రువీకరించాయి. దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు.
ఎర్ర సముద్రంలో చైనా, రష్యా వాణిజ్యనౌకలపై దాడి చేయబోమని హామీ ఇచ్చిన హౌతీ తిరుగుబాటుదారుల మాట తప్పారు. తాజాగా చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై ఐదు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ధ్రువీకరించాయి. దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. మార్చి 23న ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ఎంవీ హువాంగ్ పు నౌకపై యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారనీ అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఓడ పనామా పతాకంతో ప్రయాణిస్తోందనీ ఇది చైనాకు చెందిన సంస్థ ఆయిల్ ట్యాంకర్ అని తెలిపింది. సాయంత్రం 4.25 గంటల సమయంలో ప్రమాదంలో ఉన్నట్లు ఇది సంకేతాలు పంపిందనీ ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించిందని ప్రకటించింది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. యెమెన్ నౌకాశ్రయం మోఖా నుంచి 23 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు
లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

