లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??

లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??

Phani CH

|

Updated on: Mar 26, 2024 | 8:00 PM

ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం చూపించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని ఈడీ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం చూపించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని ఈడీ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్‌ మంత్రి ఆతిశీ మార్లీనాను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్‌ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని చెబుతున్నారు. కేజ్రీవాల్‌కు జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులూ లేవు. అయితే జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలంలో వైభవంగా శ్రీగిరి ప్రదక్షిణ.. అమ్మవారికి లక్షకుంకుమార్చన

రాజమండ్రి గామన్‌ బ్రిడ్జికి ఏమైంది ??

తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు

పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..

గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్‌