గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??

గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??

Phani CH

|

Updated on: Mar 26, 2024 | 8:44 PM

పాలమూరు రాజకీయం గోవా చేరింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. రెండు పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు. గోవా క్యాంప్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆడిపాడారు. క్రూయిజ్ షిప్‌తో పాటు.. రిసార్ట్స్ లో డీజే పాటలకు స్టెప్పులు వేశారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి నవీన్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు.

పాలమూరు రాజకీయం గోవా చేరింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. రెండు పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు. గోవా క్యాంప్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆడిపాడారు. క్రూయిజ్ షిప్‌తో పాటు.. రిసార్ట్స్ లో డీజే పాటలకు స్టెప్పులు వేశారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి నవీన్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. మార్చి 28న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 10 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఏప్రిల్ 2న ఫలితాలు రానున్నాయి. గులాబీల జెండలే రామక్క అన్న పాటకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్టెప్పులు వేశారు. అధికార కాంగ్రెస్ నేతలు కూడా తామేం తక్కువ కాదంటూ.. మూడు రంగుల జెండా పట్టి పాటకు రిసార్ట్‌లో స్టెప్పులు వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకులో డబ్బు కొల్లగొట్టి పారిపోయిన చిన్నారులు !! చివరికి ??

Velliangiri Mountains: కొండలు దాటి శివయ్యను దర్శించుకునే సాహస యాత్ర

Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

మగువలుగా మారిన మగవారు.. రతీ మన్మధులకు పూజలు

మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు