Velliangiri Mountains: కొండలు దాటి శివయ్యను దర్శించుకునే సాహస యాత్ర

Velliangiri Mountains: కొండలు దాటి శివయ్యను దర్శించుకునే సాహస యాత్ర

Phani CH

|

Updated on: Mar 26, 2024 | 8:06 PM

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లంగిరి ఆలయ ద్వారాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తుల కోసం తెరచి ఉంచుతారు. ఇప్పుడు ఆ కీలక ఘడియలు రావడంతో 112 అడుగుల అతి ఎత్తైన ఆది యోగి విగ్రహాన్ని దర్శించడానికి తమిళనాడు నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అడవి గుండా 7 కిలోమీటర్ల కాలి నడక సాగించి.. ఆరు కొండలు దాటి ఆలయానికి వెళ్లే ఈ సాహసోపేతమైన యాత్రకు భక్తులు పెద్దఎత్తున వచ్చారు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లంగిరి ఆలయ ద్వారాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తుల కోసం తెరచి ఉంచుతారు. ఇప్పుడు ఆ కీలక ఘడియలు రావడంతో 112 అడుగుల అతి ఎత్తైన ఆది యోగి విగ్రహాన్ని దర్శించడానికి తమిళనాడు నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అడవి గుండా 7 కిలోమీటర్ల కాలి నడక సాగించి.. ఆరు కొండలు దాటి ఆలయానికి వెళ్లే ఈ సాహసోపేతమైన యాత్రకు భక్తులు పెద్దఎత్తున వచ్చారు. అయితే వృద్దులు, ఆరోగ్య సమస్యలున్నవారిని యాత్రకు అనుమతించడం లేదు అధికారులు. కొండలను కాలినడకన దాటలేక మార్గమధ్యంలోనే కొందరు స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంటుంది. తాజాగా వెల్లంగిరి ఆలయ యాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడి ముగ్గురు భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ సుబ్బారావు గా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు యాత్ర ఫై ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

మగువలుగా మారిన మగవారు.. రతీ మన్మధులకు పూజలు

మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు

చైనా ఆయిల్‌ ట్యాంకర్‌పై 5 బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం

విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు