AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మో ఎండాకాలం..! చేపలు, మాంసం మాకోద్దు బాబోయ్‌.. శాఖాహార పిల్లి ఏం తింటుందో చూడండి..

కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, చేపలు, మాంసం కాకుండా శాఖాహారం భుజించే పిల్లిని మీరు ఎప్పుడైనా చూశారా..? అవును ఈ పిల్లి శాఖాహారి.. ఈ ఎండాకాలంలో చల్లగా ఉండేందుకు గానూ ఈ పిల్లి ఏం తింటుందో చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Watch: అమ్మో ఎండాకాలం..! చేపలు, మాంసం మాకోద్దు బాబోయ్‌.. శాఖాహార పిల్లి ఏం తింటుందో చూడండి..
Cute Cat
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2023 | 8:41 PM

Share

వేసవిలో ప్రజలు అధిక వేడిని నియంత్రించుకోవటానికి అనేక చర్యలు తీసుకుంటారు. సూర్య తాపానికి మనుషులే కాదు, జంతువులు కూడా ప్రభావితమవుతాయి. తాజాగా ఓ పిల్లి వడదెబ్బతో బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రిఫ్రెష్ కోసం పుచ్చకాయ లాగిం చేస్తుంది. ఎండలో తిరిగిన పిల్లి వడదెబ్బకు గురైనట్టుగా ఉంది..అందుకే హాయిగా చల్లచల్లటి పుచ్చకాయతో ఉపశమనం పొందుతోంది. ఈ అందమైన పిల్లి వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. సాధారణంగా చేపలు, మాంసం తినే పిల్లులను మీరు చూసారు. కానీ ఈ పిల్లిని చూస్తే..ఇది ఖచ్చితంగా శాఖాహార పిల్లి అంటారు. ప్రస్తుతం ఈ పిల్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే పిల్లి పుచ్చకాయ తినడం ఎప్పుడైనా చూశారా? కానీ, ఈ పిల్లి పుచ్చకాయను తెగ లాగించేస్తుంది. ఆ పిల్లి యజమాని పుచ్చకాయ తింటుండగా, పిల్లి వెనుక నుండి వచ్చి అది కూడా పుచ్చకాయను తినడం ప్రారంభించింది. దాన్ని యజమాని చేతి నుంచి తీసుకుని పిల్లి కరమ్ కురుమ్ గా తినడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో చూసిన వారికి, పిల్లి పుచ్చకాయను ఎలా తింటుంది? అని ఆశ్చర్యంగా ఉంది. ఈ అందమైన వీడియోను వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ 10 సెకన్ల ఈ వీడియో ప్రజలను వేగంగా ఆకర్షిస్తోంది. దీన్ని ట్విటర్ హ్యాండిల్ బ్యూటెంగేబిడెన్ పోస్ట్ చేసింది. వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.1 మిలియన్ సార్లు వీక్షించారు. దీనికి దాదాపు 31.4 వేల లైకులు వచ్చాయి. దాదాపు 5 వేల మంది రీట్వీట్ చేశారు. పిల్లి పుచ్చకాయ తింటున్న ఈ అందమైన వీడియోకు కామెంట్స్‌ కూడా భారీగా వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..