AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి భగవంతుడా..! బైక్‍పైనే రెచ్చిపోయిన అమ్మాయిలు.. ఆపై హగ్గులు ముద్దులు.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన ‘ఎలా అయినా ఫేమస్ అవ్వాలి’ అనే వైరస్ అంటుకోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఏం చేస్తున్నామోననే విచక్షణ కూడా కోల్పోయే స్థాయికి వెళ్తున్నారు. సాధారణంగా లవర్స్ తమకు..

Viral Video: ఓరి భగవంతుడా..! బైక్‍పైనే రెచ్చిపోయిన అమ్మాయిలు.. ఆపై హగ్గులు ముద్దులు.. వైరల్ అవుతున్న వీడియో..
Girls Bike Stunt
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 04, 2023 | 9:38 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన ‘ఎలా అయినా ఫేమస్ అవ్వాలి’ అనే వైరస్ అంటుకోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఏం చేస్తున్నామోననే విచక్షణ కూడా కోల్పోయే స్థాయికి వెళ్తున్నారు. సాధారణంగా లవర్స్ తమకు ప్రైవసీ లభించిన వెంటనే ముద్దులు పెట్టుకుంటుంటారు. అలాంటి వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అభ్యంతరకరంగా ఉన్నా అది సహజం అనుకోవచ్చు. అయితే తమకు పట్టిన ‘వైరస్’తో ఓ ఇద్దరు అమ్మాయిలు ఇంకో అడుగు ముందుకేసి కొత్తగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

అసలు వాళ్లు ఏం చేశారంటే.. రోడ్డు మీద వెళ్తున్న బైక్‌ హ్యాండిల్ విడిచి పెట్టి మరి దానిపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకున్నారు. అంతేనా గాఢంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు మండిపడుతుండగా.. మరికొందరు సరదాగా రాసుకొచ్చారు. ‘ఇది యోగీ రాష్ట్రంలో జరిగితే బాగుండేది’ అని సరదాగా రాసుకొచ్చారు ఓ నెటిజన్. మరో నెటిజన్ అయితే ‘పడిపోతే ఆ ముద్దులతోనే సరిపెట్టుకోవాలి. ఫేమస్ కావాలంటే మరీ ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదు’ అంటూ హితబోధ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ‘ఇలా చేసేవాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏమో.. ఇలాంటి వాళ్ల కోసం కష్టపడి చదివిస్తున్నందుకు వాళ్లని నిందించాలి’ అంటూ ఇంకో నెటిజన్ తన అగ్రహం వ్యక్తంచేశారు. ఇలా పలువురు నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 30 వేల లైకులు, 5 లక్షల 74 వేలకు పైగా వీక్షణలు లభించాయి.