Watch Video: తల్లి తోకతో ఆటలాడుకున్న చిరుత కూన, వీడియో వైరల్
అంతర్జాతీయ చిరుతపులుల దినోత్సవం సందర్భంగా ఇంటర్నెట్‌లో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. విభిన్న రకాల పోస్టులతో నెటిజన్లు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతర్జాతీయ చిరుతపులుల దినోత్సవం సందర్భంగా ఇంటర్నెట్‌లో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. విభిన్న రకాల పోస్టులతో నెటిజన్లు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఎంవీ రావు అనే ఓ ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చిరుతపిల్ల తన తల్లితో సందడి చేస్తూ ఆడుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ క్యూట్ వీడియోలో గమనిస్తే చిరుతపిల్ల తన తల్లి తోకను నోట కరుచుకొని ఆడుకుంటుంది. ఇది గమనించిన తల్లి తన పిల్లను తీసుకొని హత్తుకుంటుంది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ వేలాది మంది వీక్షించారు. భారత ఉపఖండంతో పాటు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ రష్యాలో కనిపించే చిరుతలపై అవగాహన కల్పించేందుకు మే 3న అంతర్జాతీయ చిరుతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు.




The bond that connects ? Nature is Amazing ?
?️ SM pic.twitter.com/jV9PG9FVww
— M V Rao @ Public Service (@mvraoforindia) May 4, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
