AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో… ఇదేం రైలుబండిరా సామీ.. ఇందులో ప్రయాణికులు కూర్చొనే అలిసిపోతారట..!

భారతదేశంలో ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. ఇవి 7300 కి పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ రైళ్లలో కొన్ని సుదూర రైళ్లు అయితే, కొన్ని రైళ్లు చాలా తక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. కానీ, మనదేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుండి కూడా అలసిపోతారు. ఎందుకంటే.. ఈ రైలు

ఓరీ దేవుడో... ఇదేం రైలుబండిరా సామీ.. ఇందులో ప్రయాణికులు కూర్చొనే అలిసిపోతారట..!
Longest Distance Train
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2025 | 8:45 AM

Share

భారతీయ రైల్వే.. అలుపెరుగని ప్రయాణం..అందరికీ అందుబాటు ధరలతో అలసట లేకుండా ప్రయాణీకుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చే అత్యుత్తమ రవాణా మార్గం. సుదూర ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా అత్యంత సౌకర్యవంతమైన, చవకైన మార్గంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ రైళ్లల్లో కొందరి ప్రయాణం ఒక గంట ఉంటే.. మరికొందరి ప్రయాణం ఒకట్రెండు రోజులు కూడా ఉంటుంది. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే రైలు ప్రయాణ ఖర్చు తక్కువ. అలాగే, పిల్లలు, పెద్దలకు అనుకూలంగా ఉండే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే దాదాపు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. కానీ, భారతదేశంలోని ఈ రైలులో కూర్చొని ప్రయాణీకులు అలసిపోతారు. ఆ కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

భారతదేశంలో ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. ఇవి 7300 కి పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ రైళ్లలో కొన్ని సుదూర రైళ్లు అయితే, కొన్ని రైళ్లు చాలా తక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. కానీ, మనదేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుండి కూడా అలసిపోతారు. ఎందుకంటే.. ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు దాదాపు 4200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుందట.

భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన రైలు పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ ప్రయాణిస్తుంది. వారానికోసారి పట్టాలెక్కుతున్న ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుందట. ఈ రైలు మార్గంలో సుమారుగా 50 స్టేషన్లు ఉన్నాయట.

ఇవి కూడా చదవండి

ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణించే ఈ రైలు ప్రయాణం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.