Viral Video: వీధి కుక్కకు మూడుపూటలా గోరు ముద్దలు.. మానవత్వాన్ని చాటుకుంటున్న మహిళ.. నెట్టింట్లో వైరల్ వీడియో..

మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు అని ఆధునిక కవి (అందెశ్రీ) ఏదో ఆవేశంలో అన్నారు కానీ.. మానవత్వమున్న మనుషులు ఇంకా మిగిలే ఉన్నారు.

Viral Video: వీధి కుక్కకు మూడుపూటలా గోరు ముద్దలు.. మానవత్వాన్ని చాటుకుంటున్న మహిళ.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Follow us
Basha Shek

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 25, 2022 | 2:31 PM

మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు అని ఆధునిక కవి (అందెశ్రీ) ఏదో ఆవేశంలో అన్నారు కానీ.. మానవత్వమున్న మనుషులు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ మాటలను నిజం చేస్తూ అప్పుడప్పుడూ కొందరు మనుషులు మనకు తారసపడుతూనే ఉంటారు. అలా తాజాగా పశ్చిమబెంగాల్ లోని రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ వీధి కుక్కకు పెరుగు అన్నం తినిపిస్తూ కనిపించింది. అదికూడా సొంత పిల్లలకు తినిపించినట్లు గోరు ముద్దలు చేస్తూ తినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంటే.. సదరు మహిళ రోజుకు ఒకసారి కాదు ఏకంగా 3 పూటలా స్టేషన్‌కు వచ్చి ఆ కుక్కకు పెరుగున్నం తినపిస్తుందట. ఇలా ఎందుకు చేస్తోందంటే..ఆ మూగజీవి పెరుగన్నం తప్ప ఇంకేమీ ముట్టుకోదట. అందుకే రోజూ మూడుసార్లు స్టేషన్‌కు వచ్చి మరీ ఆ మూగజీవి కడుపు నింపుతోందట.

కాగా ఆ మహిళ పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. ఆ కుక్క పేరు కుతుష్‌ అట. దాని వయసు సుమారు ఐదేళ్లట. ఈక్రంలో ఆ అజ్ఞాత మహిళ కుక్కకు గోరుముద్దలు తినిపిస్తున్నప్పుడు స్టేషన్‌లో ఉన్న కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. మూగజీవాల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తున్న ఆ మహిళను మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సమాజంలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది’ అన్న మాటలను ఆ మహిళ మరోసారి నిజం చేసింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Times Now (@timesnow)

Also Read:

Revanth Reddy -PK: అందుకే కేసీఆర్‌ను కలిశాడు.. పీకేపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Telangana: అక్కడ కలువకుండా కేసీఆర్‌ను కలిస్తే అనుమానాలు వచ్చేవి.. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు కామెంట్స్

చూడటానికి రెండు కళ్ళు సరిపోని విధంగా ఎట్రాక్ట్ చేస్తున్న నివేత