AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy -PK: అందుకే కేసీఆర్‌ను కలిశాడు.. పీకేపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే కిరికిరి ఓవైపు నడుస్తూనే ఉంది. అయితే కేసీఆర్‌-పీకే భేటీపై రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రేవంత్‌.. కేసీఆర్‌తో తెగదెంపుల కోసమే నిన్న పీకే కలిశారన్నారు.

Revanth Reddy -PK: అందుకే కేసీఆర్‌ను కలిశాడు.. పీకేపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Prashant Kishor Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Apr 25, 2022 | 2:23 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే కిరికిరి ఓవైపు నడుస్తూనే ఉంది. అయితే కేసీఆర్‌-పీకే భేటీపై రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రేవంత్‌.. కేసీఆర్‌తో తెగదెంపుల కోసమే నిన్న పీకే కలిశారన్నారు. ఓడిపోతున్నామనే భయంతో సీఎం కేసీఆర్‌ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులుండవని ఇప్పటికే రాహుల్‌ స్పష్టంగా చెప్పారని.. మే 6న ఇదే అంశాన్ని రాహుల్‌ బహిరంగసభలో మరోసారి చెప్తారన్నారు. పీకే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్‌ను కలిశారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో మేం బలంగా ఉన్నామన్న వీహెచ్‌…పొత్తులు అవసరం లేదన్నారు.

టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కేసీఆర్‌ను కలిశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై సోమవారం మీడియతో మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు.

పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటనే ఫైనల్‌గా ఉంటుందని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తాయన్న బీజేపీ విమర్శలను తీవ్రంగా ఖండించారు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. బీజేపీ తోనే టీఆర్‌ఎస్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. గతంలో టీఆర్‌ఎస్‌తో ఉన్న లావాదేవీలను రద్దు చేసుకోవడానికే కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయ్యారని అన్నారు జగ్గారెడ్డి.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..