Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP Leader: ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా చదివేందుకు అనుమతి ఇవ్వండి.. హోం మంత్రికి లేఖ

NCP Leader నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన ఒక నాయకుడు బీజేపీపై మండిపడ్డారు. దేశంలో హనుమాన్‌ చాలీసా పఠనం, నమాజ్‌ చదివేందుకు అనుమతి కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. హనుమాన్‌..

NCP Leader: ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా చదివేందుకు అనుమతి ఇవ్వండి.. హోం మంత్రికి లేఖ
Follow us
Subhash Goud

|

Updated on: Apr 25, 2022 | 2:02 PM

NCP Leader నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన ఒక నాయకుడు బీజేపీపై మండిపడ్డారు. దేశంలో హనుమాన్‌ చాలీసా పఠనం, నమాజ్‌ చదివేందుకు అనుమతి కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. హనుమాన్‌ చాలీసా (Hanuman Chalisa) పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్‌సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన మహిళా నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఫహ్మిదా హసన్‌ ఖాన్‌ (Fahmida Hassan Khan)తనకు ప్రధాని ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా, నమాజ్‌, దుర్గా చాలీసా, నమోకర్‌ మంత్రం, గురుగ్రంథ్‌ సాహిబ్‌ చదివేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అనుమతి తర్వాతే తాను హనుమాన్‌ చాలీసా చదువుతానని, తన ఇంట్లో దుర్గాదేవి పూజ కూడా చేస్తానని ఖాన్‌ చెప్పుకొచ్చారు. ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని నవనీత్‌ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్ష‌న్ నెలకొంది. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. వీరిద్దరికీ మే 6వ తేదీ వరకూ జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ స‌న్‌డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

CM Vs Governor: తేల్చుకుంటాం.. ఈ అధికారం ఎందుకు ఉండదు.. రాష్ట్ర గవర్నర్ అధికారాలపై డీఎంకే పోరుబాట..

Telangana: అక్కడ కలువకుండా కేసీఆర్‌ను కలిస్తే అనుమానాలు వచ్చేవి.. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు కామెంట్స్