Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది. గుర్తిస్తే మీ కళ్లలో పదునున్నట్లే!

సవాళ్లంటే మీకిష్టమేనా.? మీ మెదడుకు మేత వేయాలనుకుంటున్నారా.? అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే.. ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరి..

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది. గుర్తిస్తే మీ కళ్లలో పదునున్నట్లే!
Leopard1
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 25, 2022 | 1:32 PM

సవాళ్లంటే మీకిష్టమేనా.? మీ మెదడుకు మేత వేయాలనుకుంటున్నారా.? అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే.. ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంటోంది. ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ నుంచి వైరల్ వీడియోల వరకు అన్ని ఒక్క క్లిక్‌తో లభిస్తున్నాయి. ఇక చాలామంది సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. అటు ఫన్.. ఇటు మీ తెలివికి పరీక్ష పెట్టేందుకు ఇంటర్నెట్‌లో చాలా రకాల పజిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ‘ఈ ఫోటోలో సింహం నక్కింది’, ‘ఈ ఫోటోలో పాము ఉంది’ అనే ఫోటో పజిల్స్ మీకు తారసపడి ఉంటాయి. వాటిని తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసి ఉంటారు కూడా. ఇక అదే కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పజిల్ నెటిజన్లకు పరీక్ష పెడుతోంది. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండల ప్రాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో చిరుత ఎంచక్కా సేద తీరుతోంది. రాళ్ల రంగులో చిరుత చర్మం ఇమిడిపోవడంతో దాన్ని గుర్తించడం కొంచెం కష్టమే. కానీ మీ కళ్లలో పదునున్నట్లయితే.. చిటికెలో కనిపెట్టేస్తారు. అందుకే ఫోటోను నిశితంగా చూడండి.. ఫస్ట్ అటెంప్ట్‌లో చిరుతను గుర్తించండి. చాలామంది ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టారు. కొంతమంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. మీరూ మీ కళ్లకు పదునుపెట్టండి.. కనిపెట్టండి.. ఒకవేళ గుర్తించలేకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.