Tim David: జట్టు స్కోర్ 101/4 ఉన్నప్పుడు వచ్చాడు.. కట్ చేస్తే 3 బౌండరీలు, 6 సిక్సర్లతో RCB ఆటగాడి అరాచకం
టిమ్ డేవిడ్ తన దూకుడైన ఇన్నింగ్స్‌తో హోబర్ట్ హరికేన్స్‌కు అద్భుత విజయం అందించాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేసిన అతని బ్యాటింగ్ ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచింది. హరికేన్స్ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. డేవిడ్ ఆటతీరుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరపున ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త ఆటగాడు టిమ్ డేవిడ్ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులు దోచాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌పై జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో మూడు బౌండరీలు, ఆరు సిక్సర్లతో 62 పరుగులు చేసి, హరికేన్స్ విజయానికి మద్దతుగా నిలిచాడు.
అతను క్రీజులోకి వచ్చినప్పుడు జట్టు 101/4తో నిలిచింది, ఆటపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. కానీ తన దూకుడైన బ్యాటింగ్‌తో డేవిడ్ పవర్ సర్జ్‌లో పూర్తి ప్రయోజనం పొందాడు. అతని పరుగుల్లో 77% పైగా బౌండరీల ద్వారా వచ్చాయి, ప్రతి మూడు బంతులకు ఒక సిక్సర్‌తో ప్రత్యర్థులను ఔరా అనిపించాడు.
డేవిడ్ నాటౌట్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అతని శక్తివంతమైన షాట్లు మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాయి. ఈ ఫెంటాస్టిక్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మరోవైపు, హోబర్ట్ హరికేన్స్ స్ట్రైకర్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ విజయం వరుసగా నాలుగో గేమ్ గెలుపు కావడం విశేషం. డేవిడ్ దూకుడైన ఆటతీరుతో హరికేన్స్ విజయయాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Now THIS is how you finish a match!
Here's the highlights of Tim David's extraordinary 62* off 28 balls! #BBL14 pic.twitter.com/USeqanpBGS
— KFC Big Bash League (@BBL) January 5, 2025