Viral Video: అభిమానుల అరుపులకు ఫీల్డ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే.. వైరల్‌గా మారిన వీడియో..
శ్రీలంకతో బెంగుళూరులో జరుగుతున్న డేనైట్ టెస్ట్‌లో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంక ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు స్లిప్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నారు...
శ్రీలంకతో బెంగుళూరులో జరుగుతున్న డేనైట్ టెస్ట్‌లో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంక ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు స్లిప్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నారు. అప్పుడే స్టాడ్స్‌లో ఉన్న అభిమానులు కోహ్లీ ఉద్దేశించి ఏబీడీ అంటూ అరిచారు. కోహ్లీ చెవిని ఇటువైపు పెట్టారు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ లాగా రివర్స్ స్కూప్‌ను షాట్ కొట్టినట్లు కోహ్లీ సైగా చేశాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు ఏబీ డివిలియర్స్ బంగుళూరు తరుఫున ఆడాడు. వారి బంధాన్ని గుర్తు చేస్తూ స్టాండ్స్‌లో ప్రేక్షకులు అరిచారు.
ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా 92 పరుగులు చేయడంతో భారత్ 252 పరుగులు చేసింది. శ్రీలంక మొదటి ఇన్నిగ్స్‌లో 109 పరుగులకే అలౌట్ అయింది. భారత బౌలర్ బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. షమి, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అయితే ఈ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 50 పరుగులు కూడా చేయలేదు.
మరో వైపు భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిషబ్ పంత్(50) హాఫ్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో టెస్టుల్లో కపిల్ దేవ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బ్రేక్ చేశాడు. కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రిషబ్ పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అలాగే 161 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
ind vs Sri Lanka Test Match going on and Indian’s Crowd Chanting “ABD ABD ABD” Literally unbelievable Yaar AB de Villiers Fan following in Asia is just unreal Dream For So Many Foreign Players to have such kind of gesture in Asia?.#Kohli#RCBCaptain @ABdeVilliers17 pic.twitter.com/81z3ztRRKM
— Shaibi || ABD&PCT Stan (@ShoaibK45036955) March 12, 2022