Viral Video: సృష్టిలో చిత్రం ఈ కొండ చిలువ.. రెండు తలలతో అడవిలో చక్కర్లు..
సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. అవి వెలుగులోకి వచ్చినప్పుడు ఇదే కదా ప్రకృతిలోని అద్భుతం అని అనుకుంటాం.. ప్రస్తుతం ప్రకృతిలోని వింత జీవికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పాము రెండు తలలతో కనిపిస్తోంది. అయితే ఈ పాము నిజమా లేక AI సహాయంతో సృష్టించబడిందా అని ప్రజలు అయోమయంలో పడ్డారు. ఈ వీడియో ప్రకృతి రహస్యాలు, అద్భుతాలను ప్రతిబింబించేలా ఉందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని నవ్విస్తాయి. కొన్ని ఏడిపిస్తాయి, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్నిసార్లు మనం అడవిలో జంతువు క్రూరమైన రూపాన్ని చూస్తాము. కొన్నిసార్లు మన కళ్ళను నమ్మడానికి కూడా కష్టమయ్యే జంతువులను చూస్తాము. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనిలో రెండు తలల కొండచిలువ అడవి మధ్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన పామును చూసిన ప్రజలు అది నిజమా లేదా AI ద్వారా సృష్టించబడిందా.. నమ్మలేక పోతున్నాం అని అంటున్నారు.
వీడియోలో ఒక కొండచిలువ నేలపై నెమ్మదిగా పాకుతుంది. దీని ముఖం తప్ప మిగిలిన శరీరం ఇతర కొండ చిలువ వలనే సాధారణంగా ఉంది. అయితే దీనికి రెండు తలలు ఉన్నాయి. రెండు తలలు ఒకే శరీరానికి కలిసి ఉన్నాయి. ఈ దృశ్యం చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది, ప్రజలు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాములలో రెండు తలలు ఉండడం అరుదైన జీవసంబంధమైన వైకల్యం అని.. దీనిని బైస్ఫాలీ అంటారు. ఒకే శరీరానికి రెండు తలలు ఉంటాయి. అయితే ఇటువంటి జీవులు ఎక్కువ కాలం జీవించవు.
వీడియో చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @jamil2832 అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు.”ఇదిగో ప్రకృతి అద్భుతం. ఇప్పటివరకు.. తోకలేని పాములకు రెండు తలలు ఉంటాయని మనం అనుకుంటున్నాం.. అయితే ఈ పామును చూడండి.. రెండు తలలు ఒకే శరీరానికి ఉన్నాయి. ఈ పామును రెండు తలల పైథాన్ అని పిలుస్తారు. ఇది మధ్య పశ్చిమ ఆఫ్రికాకు చెందినది అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఈ 28 సెకన్ల వీడియోను 13,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తూ తమ ఫీలింగ్స్ ను వెల్లడిస్తున్నారు. ఇది నిజమని నేను నమ్మలేకపోతున్నాను, ఇది ఒక సినిమాలోని దృశ్యంలా అనిపిస్తుంది” అని కామెంట్ చేయగా.. మరొకరు “ప్రకృతి అద్భుతాలను చూడటం చాలా అద్భుతంగా ఉంది” అని అన్నారు. కొంతమంది వినియోగదారులు ఇది AI-జనరేటెడ్ వీడియో అని పేర్కొంటుండగా.. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ఇది నిజమైన పాము అని ధృవీకరించారు.
ప్రకృతి అద్భుతం.. వీడియోను ఇక్కడ చూడండి
कुदरत का करिश्मा देखें।
अभी तक हमलोग बिना पूंछ वाला सांप को दो मुंह वाला सांप समझते थे । या बताया जाता था।
लेकिन इस सांप को देखे एक ही तरफ़ दोनों मुंह है।
इस सांप का नाम पाइथन (two-headed python) है,
जो मूल रूप से मध्य और पश्चिमी अफ्रीका में पाया जाता है, pic.twitter.com/4judqqWzHh
— Jamil Ansari (@jamil2832) October 3, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




