Viral News: కట్నం వద్దు అన్న యువకుడు.. ఏదో లోపం ఉందని పెళ్ళికి నో చెప్పిన యువతి ఫ్యామిలీ
వరకట్నం దురాచారం.. కట్నం కోరేవాడు గాడిద అంటూ సమాజంలో ఎలుగెత్తేవారున్నారు. కట్నం కోసం దారుణానికి పాల్పడేవారి గురించి వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు కట్నం వద్దు అని చెప్పిన పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోవడానికి వధువు నిరాకరించింది. కాబోయే మామగారు రేంజ్ రోవర్ కారు, ఫ్లాట్ ఇస్తానని చెప్పినా.. ఇవన్నీ వద్దు.. మీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయండి చాలు అన్నందుకు .. నో చెప్పింది ఆ పెళ్లి కూతురు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

కారు, ఇల్లు, నగలు, నగదు కోరినవి కట్నంగా ఇవ్వలేదనే కోపంతో పెళ్లిని తిరస్కరించే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. పెళ్లి తర్వాత భార్యలను పుట్టింటి నుంచి అదనంగా కట్న కానుకలు తీసుకుని రమ్మనమని హింసించే వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు. అదనపు కట్న కోరల్లో చిక్కుకుని దురాశకు చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్నీ రెడ్డిట్‌లో పంచుకున్నారు.
నాకు కట్నం, కానుకలు వద్దు.. మీ కూతురి వివాహం చేయండి” అని చెప్పి వరుడికి వధువు ఓ రేంజ్ లో షాక్ ఇచ్చింది. రేంజ్ రోవర్ కారు , ఫ్లాట్ ఇచ్చినా.. వాటిని ఓ యువకుడు తిరస్కరించాడు. మీ కూతురు చాలు ఇవన్నీ నాకు వద్దు అని చెప్పాడు. దీంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది వధువు. అయితే ఈ సంఘటన జరిగిన ప్రదేశం.. ఆ యువకుడు ఎవరు అనేది వెల్లడించలేదు.
భారతీయ వివాహాలలో కుటుంబ విలువల కంటే వరకట్నానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఈ సంఘటనలను వివరిస్తూ.. తన బంధువులలో 27 ఏళ్ల యువకుడుఉన్నాడు. అతనికి మంచి ఆదాయం ఉందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయనకు BMW M340i కారు ఉంది. కనుక పెళ్లి సమయంలో కాబోయే అత్తగారు వాళ్ళు ఇచ్చిన కట్న, కానుకలను వద్దు అని తిరస్కరించాడు. అతను కట్నం నిరాకరిస్తున్నాడు కనుక అతనిలో ఏదో లోపం ఉండాలి పెళ్లి వద్దు అని పెళ్లి కూతురు వారు తిరస్కరించారు.
My cousin got rejected because he refused to take dowry byu/Ichizaya inThirtiesIndia
వరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, రెస్టారెంట్లు, పబ్బులు కూడా ఉన్నాయి. అంతేకాదు అతనికి పూర్వీకుల నుంచి ఆస్తి కూడా వారసత్వంగా వచ్చింది. దీంతో అతను సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. తన ఆర్థిక పరిస్థితి చాలా బాగున్నప్పుడు .. ఇక అమ్మాయి ఇంటి నుంచి డబ్బు ఎందుకు తీసుకోవాలని భావించాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కలలు కంటూ కేవలం మీ అమ్మాయి చాలు అన్నాడు.. అయితే కట్నం తీసుకొను అనడంతో పెళ్లి కూతురు.. పెళ్లి చేసుకోను అని చెప్పి.. అందరికీ షాక్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




