AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఉపవాసం ఉండి… ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయవద్దు.. ఎందుకంటే

హిందూ మతంలో పండుగలు, ఉపవాసాల తర్వాత దానం చేసే సంప్రదాయం ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం నూనె-ఉప్పు, మిగిలిపోయిన ఆహారం, చీపుర్లు, ఆధ్యాత్మిక పుస్తకాలు దానం చేయడం వల్ల ఆర్థిక నష్టం, అనారోగ్యం, కుటుంబంలో దుఃఖం, ప్రతికూల పరిణామాలు వస్తాయి. ఇటువంటి విరాళాలు పుణ్యాన్ని తగ్గించడమే కాదు.. దాత జీవితంలో సమస్యలను కూడా సృష్టిస్తాయి. కనుక ఈ వస్తువులను దానం చేయవద్దు.

Vastu Tips: ఉపవాసం ఉండి... ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయవద్దు.. ఎందుకంటే
Donation Vastu Tips
Surya Kala
|

Updated on: Oct 04, 2025 | 12:11 PM

Share

పండుగలు, ఉపవాసాల తర్వాత దానధర్మాలు చేయడం హిందూ మతంలో ఒక సాంప్రదాయ ఆచారం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దానం చేసేటప్పుడు మీరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, దుఃఖం, ప్రతికూల పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక కొన్ని వస్తువులను పండగలు, ఉపాసం చేసి దానం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నూనె – ఉప్పు: ఉపవాసం లేదా పండుగల తర్వాత దానం చేయాలని ఒక నియమం ఉంది. అయితే వాస్తు ప్రకారం ఏదైనా ఉపవాసం ముగిసిన తర్వాత నూనె లేదా ఉప్పు దానం చేయకూడదు. దీని కారణంగా దానం చేసిన పుణ్యంతో పాటు ఉపవాసం చేసిన ఫలితం కూడా పోతుంది. ఆర్థిక నష్టం, అనారోగ్య భయం మిమ్మల్ని వెంటాడుతాయని అంటారు. కనుక దానం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.

మిగిలిపోయిన ఆహారం: ఇంటికి ఆహారం కోసం వచ్చే యాచకులకు మిగిలిపోయిన లేదా చెడిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ దానం చేయకండి. ఇది ఇంట్లో సంపద , శ్రేయస్సును నిరోధిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతే కాదు ఇది కుటుంబంలో పేదరికం, అనారోగ్యం, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా ఇచ్చే ఆహారం ఎల్లప్పుడూ తాజా , శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే దానం చేయాలని చెబుతారు.

ఇవి కూడా చదవండి

చీపురు: చీపురును ఎవరికీ దానం చేయకూడదు. దీనిని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురును దానం చేయడం వల్ల ఆర్థిక నష్టం, సంపద లేకపోవడం జరుగుతుంది. అందుకే చీపురును ఎవరికీ ఎప్పుడూ ఇవ్వకూడదని అంటారు.

ఆధ్యాత్మిక పుస్తకాలు: ఇంటికి వచ్చే వారికి ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా గ్రంథాలను దానంగా ఇవ్వ వద్దు. గ్రహీత దానిని పవిత్రంగా ఉంచకపోతే లేదా చదవకపోయినా దాత పాపానికి గురవుతాడు. దీని వలన జీవితంలో అడ్డంకులు, నిరాశలు, ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురవుతాయి. కనుక ఇటువంటి దానాలు అపాత్రులకు చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్