ఇంట్లోని నేలకింద నుంచి వింత శబ్ధాలు..! తీరా ఏంటని చూడగా.. భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. భయనక వీడియో వైరల్‌..

ఇంటి కింద నుండి వింత శబ్ధాలు ఏంటని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.. అంతలోనే ఫ్లోరింగ్‌ కింద రెండు జంతువులు పోట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. కానీ నేలపై ప్లాస్టర్ ఉన్నందున దాని కింద ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఈ ప్లాస్టర్ ఓ చోట విరిగిపోయి ఉండడంతో కిందకు చూసే సరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్లాస్టర్ కింద ఏకంగా మూడు మొసళ్లు కనిపించాయి.

ఇంట్లోని నేలకింద నుంచి వింత శబ్ధాలు..!  తీరా ఏంటని చూడగా.. భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. భయనక వీడియో వైరల్‌..
Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2023 | 9:08 PM

సోషల్ మీడియాలో ఓ భయానక వీడియో వైరల్ అవుతోంది. నీళ్లలోంచి మొసలి బయటకు రావడం మీరు అనేక సందర్భాల్లో చూసే ఉంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం భయంకర మొసలి అంతే భయానకంగాక.. భూమిని చీల్చుకుని బయటకు వచ్చింది. అలాంటి వీడియో చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. మొసలి ప్రమాదకరమైన జీవి. ఇది సాధారణంగా చెరువులు, నదులు నీటి ప్రవాహాల్లో నివసిస్తుంటుంది. కొన్నిసార్లు నేలపై కూడా కనిపిస్తుంది. అయితే ఇంట్లో హాయిగా కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచో మొసలి బయటకు రావడం ఎక్కడ జరిగి ఉండదు.. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియోలో మాత్రం ఇదే సీన్‌ కనిపించింది. నేలను చీల్చుకుని ఏకంగా 3 మొసళ్లు బయటకు వచ్చాయి.

ఈ వీడియోలో ఒక మొసలి నేలను చీల్చుకుని బయటకు వస్తుండగా, కొంతమంది దానిని పనిముట్ల సహాయంతో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో దాని వెనుక నుంచి మరో రెండు మొసళ్లు వచ్చాయి. ఇది చాలా భయానకంగా ఉంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ వీడియో భారతదేశంలోని ఒక రాష్ట్రం చెందినదిగా తెలిసింది. హఠాత్తుగా నేల కింద నుండి వింత శబ్దాలు రావటంతో ఆ ఇంట్లో వారంతా షాక్‌లో ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇంటి కింద నుండి వింత శబ్ధాలు ఏంటని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.. అంతలోనే ఫ్లోరింగ్‌ కింద రెండు జంతువులు పోట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. కానీ నేలపై ప్లాస్టర్ ఉన్నందున దాని కింద ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఈ ప్లాస్టర్ ఓ చోట విరిగిపోయి ఉండడంతో కిందకు చూసే సరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్లాస్టర్ కింద ఏకంగా మూడు మొసళ్లు కనిపించాయి. దీని తర్వాత, ప్రజలు భయాందోళనలతో ఫ్లోరింగ్‌ను పగలగొట్టడం ప్రారంభించారు.. దాంతో 3 మొసళ్లు నేలను చీల్చుకుని బయటకు వచ్చాయి. ఇదంతా చూసి గుంపుగా నిల్చున్న జనం గగ్గోలు పడ్డారు. మొసలిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఈ వీడియో Instagramలో @mksinfo.official ఖాతాలో షేర్‌ చేయబడింది. ఈ వీడియో మిలియన్ల సార్లు వీక్షించబడింది. ప్రజలు దానిపై చాలా కామెంట్లు చేస్తున్నారు. మరింత కిందకు త్రవ్వి చూడండి.. ఇంకా ఏవైనా మొసళ్ళు ఉన్నాయెమో అంటున్నారు. ఉంటే.. ఇంట్లో ఎక్కడ నుండి వస్తున్నాయో చూడండి. మొసళ్ళు భూమి క్రింద నుండి బయటకు రావడం ఏంటని.. ఇంత భయానకంగా ఉందంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్