వామ్మో ఇదేం ప్రత్యేకం..! ఎత్తైన పర్వతంపై గాల్లో వేలాడుతున్న దుకాణం.. ఎలా వెళ్లాలో తెలుసా..? అక్కడ స్పెషలేంటంటే..
ఇది 393 అడుగుల ఎత్తులో ఒక బండపై వేలాడుతోంది. ఈ దుకాణం ఆ పర్వతం నుండి ఇనుప పట్టీల సహాయంతో వేలాడదీయబడింది. ఈ స్టోర్ ప్రపంచంలోనే అత్యంత అసౌకర్యవంతమైన దుకాణంగా వర్ణించబడింది. ఈ స్టోర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ఒక రోజు క్రితం ముందే షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది దాదాపు ఏడు లక్షల సార్లు వీక్షించబడింది. దీంతో పాటు 5 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.
ఒక దుకాణం 393 అడుగుల ఎత్తులో ఉంటే, మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి అక్కడికి వెళతారా? బహుశా మీరు అవును అని చెప్పే ముందు వందసార్లు ఆలోచిస్తారు. అయితే, అలాంటి షాప్ ఒకటి చైనాలో ఉంది. ఇది 393 అడుగుల ఎత్తులో ఒక బండపై వేలాడుతోంది. ఈ దుకాణం ఆ పర్వతం నుండి ఇనుప పట్టీల సహాయంతో వేలాడదీయబడింది. ఈ స్టోర్ ప్రపంచంలోనే అత్యంత అసౌకర్యవంతమైన దుకాణంగా వర్ణించబడింది. ఈ స్టోర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుకాణం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అందానికి ప్రసిద్ధి చెందిన అనేక హోటళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు రోమింగ్ సమయంలో అనేక హోటళ్లలో బస చేసి, ఆ ప్రదేశ అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ, ఈ రోజు మనం ఒక ప్రమాదకరమైన దుకాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దుకాణం కొండ అంచున అతికించినట్టుగా నిర్మించబడింది. ఈ దుకాణంలో షాపింగ్ అంటే.. సాహస యాత్ర కంటే తక్కువేమీ కాదు. మీరు కూడా సాహసాలతో నిండిన ప్రదేశాలను అన్వేషించాలనే అభిరుచిని కలిగి ఉంటే, ఖచ్చితంగా ఈ దుకాణానికి వెళ్లండి. వివరాల్లోకి వెళితే..
చైనాలోని ఈ స్టోర్ ప్రత్యేకమైన ఇలాంటి లొకేషన్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని ఎత్తైన కొండపై ఒక ప్రత్యేకమైన దుకాణం నిర్మించబడింది. ఈ దుకాణం కొండకు ఆనుకుని వేలాడుతోంది. ఇక్కడికి చేరుకోవాలంటే తాడుకు వేలాడుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ కన్వీనియన్స్ స్టోర్‌లో అంత ప్రత్యేకత ఏంటని మీరు అనుకోవచ్చు..కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత కష్టపడి అక్కడకు చేరుకుంటే ఈ దుకాణంలో కస్టమర్లకు లభించేది కేవలం ఫలహారాలు మాత్రమే లభిస్తాయి. ఇది దాదాపు 393 అడుగుల ఎత్తులో ఒక కొండ అంచున గాలిలో వేలాడుతోంది. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఇక్కడ అలాంటిదే ఉంది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జిన్యుజై నేషనల్ జియోలాజికల్ పార్క్‌లోని పర్వతంపై ఓ వైపు ఒక చిన్న చెక్క ముద్ద వేలాడుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నిర్మాణం. కాదు.. దుకాణం అని చెప్పాలి. నివేదిక ప్రకారం, పర్వతారోహకుల మధ్య విరామం అవసరమయ్యే పర్వతారోహకులకు ఇది అల్ఫహారాలను విక్రయిస్తుంది.
Pingjiang,Hunan, a convenience store on a cliff. There is only one commodity here, that is, water. 😃😃😃 pic.twitter.com/ednQmt3z0p
— Sharing Travel (@TripInChina) August 23, 2022
@gunsnrosesgirl3 హ్యాండిల్‌తో ఈ స్టోర్ ఫోటో కూడా ఇటీవల ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఫోటోలు షేర్ చేయబడినప్పటి నుండి, ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్ ఒక రోజు క్రితం ముందే షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది దాదాపు ఏడు లక్షల సార్లు వీక్షించబడింది. దీంతో పాటు 5 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ స్టోర్‌పై చాలా మంది తమ స్పందనలను పంచుకున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు.. ఇది పిచ్చి పని అని..నమ్మేలా లేదని అంటున్నారు. దీని వెనుక కారణాన్ని ఊహించలేమన్నారు. కానీ ఇది అద్భుతమైనదిగా పేర్కొన్నారు. మరికొందరు కేవలం బ్రేక్ ఫాస్ట్ వంటి అల్ఫాహారం కోసం అంత రిస్క్ అవసరమా బ్రో అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..