Eiffel Tower: మందుబాబుల మజాకా..! మద్యం మత్తులో ఈఫిల్‌ టవర్‌పై నిద్రపోయిన అమెరికన్‌ టూరిస్టులు..

ఈ సంఘటన ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌కు ప్రమాద హెచ్చరికగా మారింది! శనివారం తెల్లవారుజామున ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. బాంబు స్క్వాడ్‌, పోలీసులు ఇక్కడి రెస్టారెంట్‌తో సహా టవర్‌లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాతే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. జరిగిన సంఘటనపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన ఈ ఈఫిల్ టవర్‌ను సందర్శిస్తారు.

Eiffel Tower: మందుబాబుల మజాకా..! మద్యం మత్తులో ఈఫిల్‌ టవర్‌పై నిద్రపోయిన అమెరికన్‌ టూరిస్టులు..
Eiffel Tower
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2023 | 8:55 PM

ఇద్దరు అమెరికన్‌ టూరిస్టులు మద్యం మత్తులో ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయారు. భద్రతా నిబంధనలను వదిలిపెట్టిన ఈ పర్యాటకులు ఈఫిల్ టవర్ అంతస్తుల్లో రాత్రంతా గడిపారు. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఉదయం 9 గంటలకు భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీలకు వెళ్లగా ఈ విషయం వెల్లడైంది. ఆ ఇద్దరు టవర్‌లోని రెండు, మూడో అంతస్తుల్లో రాత్రంతా గడిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆగస్టు 13వ తేదీ రాత్రి ఆ ఇద్దరు ఈఫిల్‌ టవర్‌ అధిరోహించారు. తాగిన మైకంలో పర్యాటకులకు అనుమతి లేకుండా అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. టవర్ మూసివేసే సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందకు దింపారు. కానీ, నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన ఇద్దరిని గమనించలేదు. అలా ఇద్దరు అమెరికన్ టూరిస్టులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే పడుకున్నారు. ఇటీవల ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వార్తల నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించింది.

ఆ ఇద్దరు అతిగా మద్యం సేవించి ఉన్నందున పోలీసులకు పట్టుబడ్డాడని పారిస్ ప్రాసిక్యూటర్ తెలిపారు. వారిద్దరూ ఆదివారం రాత్రి 10.40 గంటలకు ఈఫిల్ టవర్‌లోకి ప్రవేశించేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే తిరిగి కిందకు రాలేదని తెలిసింది. సెక్యూరిటీ గార్డు కంట పడకుండా అక్కడే నిద్రపోతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిద్దరినీ కిందకు దించారు. అనంతరం వారిని పారిస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌కు ప్రమాద హెచ్చరికగా మారింది!

ఇవి కూడా చదవండి

శనివారం తెల్లవారుజామున ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. బాంబు స్క్వాడ్‌, పోలీసులు ఇక్కడి రెస్టారెంట్‌తో సహా టవర్‌లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆ తర్వాతే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. జరిగిన సంఘటనపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ నిర్మాణం 1887లో ప్రారంభమై మార్చి 31, 1889న పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన ఈ ఈఫిల్ టవర్‌ను సందర్శిస్తారు. 2022 సంవత్సరంలో ఈఫిల్ టవర్‌ను 62 లక్షల మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి