Andhra Pradesh: వర్షాల కోసం వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం నాకిన రైతులు.. వీడియో వైరల్.
గ్రామీణ ప్రజలు సాధారణంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు. ఆ క్రమంలో విజయనగరం సమీపంలోని ఓ గ్రామంలో రైతులు వర్షాల కోసం వినూత్న రీతిలో పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల కోసం ఎదురు చూసి చూసి ఇక చేసేదిలేక తాము నమ్ముకున్న అమ్మవారికి గ్రామపెద్దల సలహాలు, సూచనల మేరకు మొక్కులు చెల్లించేందుకు వింత ఆచారాన్ని పాటించారు రైతులు..
గ్రామీణ ప్రజలు సాధారణంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు. ఆ క్రమంలో విజయనగరం సమీపంలోని ఓ గ్రామంలో రైతులు వర్షాల కోసం వినూత్న రీతిలో పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల కోసం ఎదురు చూసి చూసి ఇక చేసేదిలేక తాము నమ్ముకున్న అమ్మవారికి గ్రామపెద్దల సలహాలు, సూచనల మేరకు మొక్కులు చెల్లించేందుకు వింత ఆచారాన్ని పాటించారు రైతులు.. సాలూరు మండలం కూర్మరాజు పేటలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామానికి సమీపంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న అమ్మవారి దేవాలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్లారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో వరదపాయసం తయారుచేశారు. ఆ తర్వాత చాపరాయిపై నైవేద్యాన్ని వేసి నాలుకతో రైతులు తీసుకున్నారు. ఈ తంతు అంతా జరగటానికి సుమారు ఏడు గంటల సమయం పట్టింది. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ తంతు పూర్తయిన వెంటనే అందరూ ఎదురు చూస్తుండగానే మేఘాలు కమ్ముకొని వర్షం ప్రారంభమై సుమారు గంట పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...