Viral Video: ఇదేం పిచ్చి తల్లీ.. వరదల్లో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకుంటున్న మహిళ.. వైరల్ వీడియో
వైరల్ అవుతున్న వీడియోలో, వరద నీటిలో ఒక మహిళ సెల్ఫీ స్టిక్‌తో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. వరద నీరు మహిళ వైపు వేగంగా వస్తుంది.. ఆ వరద వేగానికి దూరంగా వెళ్తూ.. సెల్ఫీతో వరదని చిత్రీ కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది..
Viral Video: సందర్భానుసారంగా కొన్ని పాత వీడియోలను వెలికి తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు నెటిజన్లు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు.. ఈ సందర్భమది ఓ మహిళకు చెందిన పాత వీడియో షేర్ చేస్తున్నారు.. నెటిజన్లు ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో సందడి చేయడానికి తమ వీడియోలకు, ఫోటోలకు లైక్‌లు వ్యూస్ ను పొందడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అటువంటిదే. ఈ క్లిప్‌లో భారీ వరద ఓ గ్రామం వైపు వేగంగా వెళ్తోంది. ఈ ప్రమాదకరమైన సమయంలో కూడా ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటుంది.. అంతేకాదు ఈ వీడియోలో, మహిళ మెడ వరకు వరద నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ, ఆమె భయపడకుండా సెల్ఫీ స్టిక్‌తో వీడియోలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో, వరద నీటిలో ఒక మహిళ సెల్ఫీ స్టిక్‌తో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. వరద నీరు మహిళ వైపు వేగంగా వస్తుంది.. ఆ వరద వేగానికి దూరంగా వెళ్తూ.. సెల్ఫీతో వరదని చిత్రీ కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.. చివరికి వరద నీరు ఆ మహిళని ముంచెత్తింది.. దాదాపు వరద నీటిలో ఆ మహిళ మునిగిపోయింది కూడా.. అయితే ఇంత జరిగినా ఆ మహిళ సెల్ఫీ స్టిక్ వదలకపోవడం ఆశ్చర్యకరం. మెడ వరకు నీళ్లలో మునిగిపోయిన తర్వాత కూడా ఆ మహిళ వీడియోలు చేస్తూనే ఉంది.
The first thing to do during a flood is to take a selfie stick!
— Figen (@TheFigen) July 11, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఫిగెన్ అనే ఖాతాతో షేర్ చేయబడింది. ‘వరదల సమయంలో మొదటి సెల్ఫీ స్టిక్ తో వీడియో తీయాలన క్యాప్షన్ జత చేశారు. ఒక రోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 68 వేలకు పైగా వీక్షించారు. ఈ పోస్ట్‌ను 15 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా వినియోగదారులు రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తునే ఉన్నారు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు ఇది చాలా పాత వీడియో అని.. ఓ సారి అక్కడ సునామీ హెచ్చరిక జారీ చేశారు. అది పట్టించుకోకుండా కొంతమంది వరద వస్తున్న సందర్భమది వీడియోలు చేయడం ప్రారంభించారు. అందులో భాగమే ఈ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వినియోగదారు ఆ మహిళ వరదల సెల్ఫీపై స్పందిస్తూ.. ప్రపంచంలో ఇడియట్స్ కొరత లేదని వ్యాఖ్యానించారు. మహిళ సెల్ఫి పిచ్చిని తిడుతూ.. ముందు ప్రాణాలు ముఖ్యం.. తర్వాత వీడియో అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.