AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైవర్ లేని ట్రక్ కదలడం మొదలైంది.. దానిని ఆపడానికి ప్రాణం పణంగా పెట్టిన యువతి వైరల్ వీడియో

వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ లేకుండా ట్రక్కు కదలడం మొదలైంది. ఏట వాలుగా ఉన్న రోడ్డుపై వేగంగా కదలడం మొదలు పెట్టినట్లు చూడవచ్చు. అదే సమయంలో సమీపంలో ఒక అమ్మాయి కూడా ఉంది. ట్రక్కు కదలడం చూసిన వెంటనే దాని వైపు పరుగెత్తింది. తర్వాత చాలా కష్టపడి ట్రక్కుపైకి ఎక్కి హ్యాండ్‌బ్రేక్‌నులాగింది. ఆ యువతి ఇలా చేయకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని వీడియో చూస్తుంటే తెలుస్తుంది.

డ్రైవర్ లేని ట్రక్ కదలడం మొదలైంది.. దానిని ఆపడానికి ప్రాణం పణంగా పెట్టిన యువతి వైరల్ వీడియో
Viral Video
Surya Kala
|

Updated on: Aug 06, 2024 | 12:00 PM

Share

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని వ్యక్తుల ధైర్యాన్ని. వారి వివేకాన్ని తెలియజేస్తాయి. అంతేకాదు ఇతరులకు అవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇటీవల, అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందులో ఒక అమ్మాయి తన తెలివి, ధైర్య సాహసాలతో పెను ప్రమాదాన్ని నివారించింది. ఈ వీడియో చూసిన వారు ఆ అమ్మాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ లేకుండా ట్రక్కు కదలడం మొదలైంది. ఏట వాలుగా ఉన్న రోడ్డుపై వేగంగా కదలడం మొదలు పెట్టినట్లు చూడవచ్చు. అదే సమయంలో సమీపంలో ఒక అమ్మాయి కూడా ఉంది. ట్రక్కు కదలడం చూసిన వెంటనే దాని వైపు పరుగెత్తింది. తర్వాత చాలా కష్టపడి ట్రక్కుపైకి ఎక్కి హ్యాండ్‌బ్రేక్‌నులాగింది. ఆ యువతి ఇలా చేయకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే, ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. అప్పుడు అదుపు తప్పిన ట్రక్కు వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh హ్యాండిల్‌లో షేర్ చేశారు. హ్యాండ్‌బ్రేక్‌ను లాగేందుకు ధైర్యవంతురాలైన యువతి కదులుతున్న ట్రక్కుపైకి ఎక్కింది’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 3.6 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. యువతి ధైర్యం, క్షణాల్లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇది దైర్యవంతుల లక్షణం.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉంటారు ఒకరు వ్యాఖ్యానించారు. మరోకరు అమ్మాయి తన తెలివి తేటలను బాగా ఉపయోగించింది అని కామెంట్ చేయగా.. ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అంటూ ఇంకొకరు.. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కదులుతున్న లారీపైకి ఎక్కింది. ధైర్యవంతులు ఇలాగే ఉంటారని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!