Viral: తెల్లారి పశువుల పాకలోకి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించినవి చూసి గుండె గుభేల్

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగభీడ్ తాలూకా బాలాపూర్(ఖుర్టు)లో ఓ చిరుత జనవాసాల్లోకి వచ్చి మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురిపై దాడి చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral: తెల్లారి పశువుల పాకలోకి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించినవి చూసి గుండె గుభేల్
Representative Image
Follow us
Naresh Gollana

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2024 | 11:02 AM

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగభీడ్ తాలూకా బాలాపూర్(ఖుర్టు)లో ఓ చిరుత జనవాసాల్లోకి వచ్చి మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురిపై దాడి చేసింది. ఈ దాడి ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది‌. మనుషులపైనే కాదు ఆ తల్లి చిరుత పశువులపై సైతం దాడిచేసి హతమార్చింది. బాలాపూర్ గ్రామ పొలిమేరలో రైతు డిమేవ్ సలోటేకు చెందిన పశువుల పాకలో దూరిన చిరుత సోమవారం ఉదయం మూడు‌పిల్లలకు జన్మనిచ్చింది.

సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో చిరుత పారిపోయింది. పాకలో అరుపులు వినిపించడంతో వెళ్లి చూసిన స్థానికులకు మూడు చిరుత పిల్లలు దర్శనమిచ్చాయి. అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగిన‌అటవిశాఖ సిబ్బంది చిరుత పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు‌కనిపించక పోవడంతో తల్లి చిరుత గ్రామం పై విరుచుకు పడవచ్చని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అటవి అదికారులు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి