Dog Viral Video: వారెవ్వా.. కుక్క రాజసం, దర్జాకి నెటిజన్లు ఫిదా.. ఇలాంటి వీడియో మీరెప్పుడూ చూసుండరు!

తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత అందమైన ప్లాన్‌ వేసింది ఈ కుక్క అంటున్నారు మరికొందరు నెటిజన్లు.. ఇలా వెళితే.. ఆటోకు అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. కుక్క విన్యాసాన్ని చూసి నిజంగానే చాలా మంది ఆశ్చర్యంతో ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 10 లక్షల వ్యూస్‌ను సంపాదించింది. లైక్‌లు దాదాపు 20,000కు పైగానే వచ్చాయి.

Dog Viral Video: వారెవ్వా.. కుక్క రాజసం, దర్జాకి నెటిజన్లు ఫిదా.. ఇలాంటి వీడియో మీరెప్పుడూ చూసుండరు!
Dog Riding Auto On Its Roof
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2024 | 4:32 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అలాంటి వీడియోలను చూస్తూ చాలా మంది ఎంజాయ్‌ చేస్తుంటారు. వాట్సాప్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో సన్నిహిత వ్యక్తులకు దీన్ని మళ్లీ మళ్లీ షేర్‌ చేస్తుంటారు. వారిని కూడా నవ్వుతూ ఆనందపడేలా చేస్తుంటారు. అలా చాలా మంది ఇలాంటి సోషల్ మీడియా వీడియోలను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసి వైరల్‌గా చేస్తుంటారు. ఇక వాటికి లైకులు, కామెంట్ల వరద కొనసాగుతుంది. ఈ వైరల్ వీడియోలలో జంతువుల వీడియోలు ముఖ్యంగా నెటిజన్లను ఆకర్షిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది. వైరల్‌ వీడియోలో ఒక కుక్క చేసిన పని నెట్టింట హల్‌చల్‌ అవుతోంది.

ఇటీవల, విద్యార్థి జ్యోతిష్ అనే ఖాతా ద్వారా కుక్క వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడింది. ఆ వీడియోలో వాహనాల రద్దీ కొనసాగుతుంది. అంతలోనే ఓ వెనుకాలే.. ఒక ఆటో కూడా వెళ్తోంది. రోడ్డన్నాక కార్లు, ఆటోలు వెళ్లటం సహజం అనుకుంటున్నారా కదా.? కానీ, ఇక్కడే ఓ విచిత్రమైన్‌ సీన్‌ కనిపించింది. కదులుతున్న ఆటో రిక్షా టాప్‌పై కనిపించిన సీన్‌ చూసి నెటిజన్లు షాకయ్యారు. ఆ ఆటో టాప్‌పై ఓ కుక్క పిల్లాడిలా కూర్చొని వెళ్తోంది. బాహుశ ఈ కుక్క పట్టణం ఎలా ఉందో చూసేందుకు ఆటో ఎక్కిందంటున్నారు నెటిజన్లు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో సూపర్‌ సాంగ్‌ ఒకటి ప్లే అవుతోంది. కుక్క రాజసం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

9 సెకన్ల వైరల్ క్లిప్‌లో కుక్క చేసిన పని చూసిన చాలామంది నవ్వుకుంటున్నారు. కుక్కకి కాస్త తెలివితేటలు ఎక్కువే ఉన్నాయని చాలా మంది కామెంట్ చేశారు. తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత అందమైన ప్లాన్‌ వేసింది ఈ కుక్క అంటున్నారు మరికొందరు నెటిజన్లు.. ఇలా వెళితే.. ఆటోకు అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. కుక్క విన్యాసాన్ని చూసి నిజంగానే చాలా మంది ఆశ్చర్యంతో ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 10 లక్షల వ్యూస్‌ను సంపాదించింది. లైక్‌లు దాదాపు 20,000కు పైగానే వచ్చాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి