Viral Video: వార్నీ.. ఇదేక్కడి తెలివితక్కువ చిరుతరా సామీ.. నీళ్ల కోసం చెరువులో దిగి ఏం చేసిందో చూస్తే పొట్ట చెక్కలే..!

చిరుతపులులు చాలా తెలివైన జంతువులుగా చెబుతారు. అలాంటి చిరుతపులి తెలివి తక్కువ పనులు చేస్తుందని ఎవరూ అనుకోరు.. కానీ, ఈ వీడియోలో చిరుత చాలా గందరగోళం సృష్టించింది. దాహంతో ఉన్న చిరుతపులి చెరువులో నీరు తాగుతూ

Viral Video: వార్నీ.. ఇదేక్కడి తెలివితక్కువ చిరుతరా సామీ.. నీళ్ల కోసం చెరువులో దిగి ఏం చేసిందో చూస్తే పొట్ట చెక్కలే..!
Tiger Biting Its Tail
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2024 | 8:49 PM

జంతువులు, పక్షుల వీడియోలను చూడటానికి ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇందుకు సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని జంతువుల చేష్టలు చూసి నెటిజన్లు ఆనందిస్తుంటారు. జంతువులకు సంబంధించి కొన్ని వీడియోలు చాలా భయానకంగా ఉంటాయి. కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఈసారి చిరుతపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లను మాత్రం ఈ వీడియో కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నవ్వు ఆగదు. ఎందుకంటే.. వేగం, చురుకుదనానికి చిహ్నం అయిన చిరుతపులి చేసిన తెలివి తక్కువ పనిని ఎవరూ ఊహించలేదు. నెటిజన్లు ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను 7.9 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

చిరుతపులులు చాలా తెలివైన జంతువులుగా చెబుతారు. అలాంటి చిరుతపులి తెలివి తక్కువ పనులు చేస్తుందని ఎవరూ అనుకోరు.. కానీ, ఈ వీడియోలో చిరుత చాలా గందరగోళం సృష్టించింది. దాహంతో ఉన్న చిరుతపులి చెరువులో నీరు తాగుతూ తన తోకను చూసి జడుసుకుంటుంది. ఎవరో తనను వెంటాడుతున్నారని అనుకుందో ఏమో తెలియదు గానీ, తన తోకను పట్టిలాగేందుకు తెగ ప్రయత్నించింది. ఎట్టకేలకు నోటికి చిక్కిన దాన్ని నీటిలోంచి బయటికి తీసుకొచ్చి తినేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో తన తోకను నోటిలో పెట్టుకుని చెరువులోంచి బయటకు వచ్చింది. తోకను నోటితో పట్టకున్న పులి అప్పటికీ అసలు విషయం గుర్తించకుండా చాలా సేపు గింగిరాలు తిరిగింది. తన తోకను తానే లాగే ప్రయత్నంలో తన చుట్టూ తానే చాలా సార్లు తిరుగుతూ చివరకు ఒడ్డుకు వచ్చేస్తుంది. అది చూసి నెట్ ప్రపంచం తెగ నవ్వుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Savan007 (@savan_editzz.007)

వైరల్‌ వీడియో చూసిన జనాలు ఈ వీడియోకు తమ ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు. ఈ వైరల్ వీడియో 21 జూన్ 2024న సోషల్ మీడియా సైట్ Instagramలో పోస్ట్ చేయగా, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అలాగే ఈ వైరల్ వీడియోను 7.9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. వామ్మో ఇది మామూలు కామెడీ కాదు అని కొందరు అంటుంటే.. ఇది అమాయక పులిలా ఉందే అంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు. మొత్తానికి ఈ చిరుతపులి చేసిన తెలివి తక్కువ పని మాత్రం నెటిజన్లను తెగ నవ్విస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!