AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teleportation: అమ్మ బాబోయ్ ఇది నిజంగా నిజమేనా? అసలు ఇలా జరుగుతుందా? వీడియో చూస్తే షాకే..!

మానవులమైన మనం సైన్స్ రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్న అద్భుతాలను చూస్తే అర్థమవుతుంది. అయితే, నేటికీ శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేని అనేక రహస్యాలు ఉన్నాయి. అవి ఏలియన్స్ కావొచ్చు.. UFO లు కావొచ్చు.. టైమ్ ట్రావెల్ కావచ్చు.. టెలిపోర్టేషన్.. కావొచ్చు.. మరింత ఆసక్తిని రేపుతాయి. మీకు సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే.. టెలిపోర్టేషన్ గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.

Teleportation: అమ్మ బాబోయ్ ఇది నిజంగా నిజమేనా? అసలు ఇలా జరుగుతుందా? వీడియో చూస్తే షాకే..!
Magic
Shiva Prajapati
|

Updated on: Sep 10, 2023 | 10:00 AM

Share

మానవులమైన మనం సైన్స్ రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్న అద్భుతాలను చూస్తే అర్థమవుతుంది. అయితే, నేటికీ శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేని అనేక రహస్యాలు ఉన్నాయి. అవి ఏలియన్స్ కావొచ్చు.. UFO లు కావొచ్చు.. టైమ్ ట్రావెల్ కావచ్చు.. టెలిపోర్టేషన్.. కావొచ్చు.. మరింత ఆసక్తిని రేపుతాయి. మీకు సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే.. టెలిపోర్టేషన్ గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్క అడుగు కూడా వేయకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అదృశ్యమవడాన్నే టెలిపోర్టేషన్ అంటారు. ఇది సాధ్యం కాకపోయినా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న మ్యాజిక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి.. ఈ వీడియోలో ఒక గాజు పెట్టె లోపల లాక్ చేయబడిన కొందరు వ్యక్తులు అదృశ్యమై.. మరొక గాజు పెట్టెకు చేరుకోవడం కనిపిస్తుంది. ఈ సీన్‌ను చూసిన వారు నిజంగా షాక్ అవుతున్నారు. అసలు ఇదెలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. దీనిని టెలిపోర్టేషన్ అంటారు. ఒక పెద్ద గాజు బాక్స్‌లో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ బాక్స్‌ నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. ఇంతలో, ఒక వ్యక్తి వచ్చి ఆ బాక్స్‌ని కర్టెన్‌తో కప్పేస్తాడు. అతను ఆ పక్కనే ఉన్న మరో బాక్స్‌ను కూడా కవర్ చేస్తాడు. అదే సమయంలో ఓ అమ్మాయి వచ్చి.. మొదటి బాక్స్‌ను కవర్ చేసిన తెరను పైకి లాగేస్తుంది. ఇంకేముంది.. అప్పటి వరకు ఉన్న మనుషులు అందులో కనిపించకుండా పోతారు. మరో బాక్స్ కవర్ ఓపెన్ చేయగా.. వారంతా అందులోకి కనిపించారు. ఇది షాకింగ్‌ సీన్‌ ను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అసలు ఇదెలా సాధ్యమైందంటూ షాక్‌లోనే ఉండిపోయారు.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో leonardo_fisicacuantica అనే IDతో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 8.43 లక్షల వ్యూస్ వచ్చాయి. 30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యోపోతున్నారు. ఇందులో ఏమైనా మ్యాజిక్ దాగుందా? లేక సైన్స్ లాజిక్ ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..