Viral News: ఆ దేశంలో కాకరకాయలు చాలా రిచ్‌గురూ.. కేజీ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
bitter gourd price USA: సాధారణంగా మన దేశంలో కొన్ని వస్తుల ధరలను ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయని మనం మాట్లుడుకుంటూం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్న ఒక వీడియో ఈ టాపిక్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఒక ఇండియన్ యువతి.. అమెరికాలోని సూపర్ మార్కెట్‌లో కాకరకాయ ధరల రేట్లను ప్రస్థావించింది. ఆమె చెప్పిన రేట్లు విన్న తర్వాత జనాలంతా షాక్ అయిపోయారు.

మన దేశంలో సాధారణ కూరగాయగా పరిగణించే కాకరకాయలను అమెరికాలో రిచ్చేస్ట్ కూరగాయగా అమ్ముతున్నారని ప్రస్తావిస్తూ ఆ దేశంలో నివసించే ఒక ఇండియన్ యువత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న ఒక ఇండియన్ యువతి స్థానికంగా ఉన్న ఒక సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి నప్పుడు అక్కడి కాకరకాయ రేట్లను చూసి షాక్ అయ్యింది. వాటి ధరలను ప్రస్తావిస్తూ ఆమె ఒక వీడియో క్రియేట్ చేసింది. ఆమె కాకరకాయలను చూపిస్తూ.. 450 గ్రామలు ఉన్న ఒక్క కాకరకాయ ఖరీదు రూ. 270 అని ఆమె చెప్పింది. అది విన్న చాలా మంది నెటిజన్లు షాకయ్యారు.
భారతదేశం, అమెరికా కాకరకాయల ధరల మధ్య తేడా
భారతదేశంలో, సాధారణంగా సీజన్‌లో కాకరకాయ కేజీ రూ. 30 నుండి రూ. 60 వరకు దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువ వస్తుంది. కానీ అమెరికాలో మాత్రం దీని రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ కాకరకాయల దిగుమతి తక్కువ, అందుకే రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాదు మన దేశంలో తక్కువగా దొరికే చాలా వస్తువులు విదేశాల్లో ఎక్కవగా ఉంటాయి. ఎందుకంటే రవాణా ఖర్చులు, పన్నులు, డిమాండ్‌ను భట్ట అక్కడి ధరలను నిర్ణయిస్తారు. ఫలితంగా, ఇక్కడ చౌకగా దొరికే వస్తువులు అమెరికాలో ఖరీదైనవిగా అనిపిస్తాయి.
View this post on Instagram
విదేశాల్లో భారతీయ కూరగాయలకు డిమాండ్
ఒక్క అమెరికానే కాదు, ఇతర దేశాల్లో కూడా మన భారతీయ కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన చాలా మంది భారతీయ కూరగాయలను వదులు కోవడానికి ఇష్టపడరు. అయితే మన దేశంలో పండే ఈ కూరగాయాలు విదేశాల్లో దొరకవు కాబట్టి వాటిని ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే అక్కడ కూరగాయల రేట్లు మన దేశంతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
